తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 11:34 PM IST

Updated : Dec 4, 2019, 11:39 PM IST

ETV Bharat / bharat

శబరిమలలో మొబైల్​ ఫోన్ల వాడకం నిషేధం..!

కేరళలోని అయ్యప్ప పుణ్యక్షేత్రం గర్భగుడి ప్రాంగణంలో ఫోన్​ వాడకాన్ని నిషేధించింది ట్రావెన్​కోర్​ దేవస్థాన​ బోర్డు. ఇటీవల గర్భగుడికి చెందిన పలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టినందున ఈ నిర్ణయం తీసుకుంది. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే హెచ్చరిక, రెండోసారి అతిక్రమిస్తే వేటు వేస్తామని తెలిపింది.

sabermale
అయ్యప్ప సన్నిధిలో ఫోన్​ నిషేధం...వాడితే స్వాధీనం

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి సన్నిధి గర్భగుడిలో మొబైల్ ఫోన్​లు వాడటాన్ని నిషేధించింది ట్రావెన్​కోర్​ దేవస్థాన మండలి. ఆలయ గర్భగుడికి చెందిన పలు చిత్రాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టినందున ఈ నిర్ణయం తీసుకున్నారు బోర్డు సభ్యులు.

పవిత్రమైన 18 మెట్లు, ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే 'తిరు ముట్టమ్​' దాటిన తర్వాత భక్తులు మొబైల్​ ఫోన్లు వినియాగించరాదని స్పష్టం చేశారు. 'వల్లియ నడపండాల్​' వద్దే ఫోన్లు స్విచ్చాఫ్​ చేయాలని సూచించారు.

మొదటిసారి హెచ్చరిక

మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ సదరు వ్యక్తికి హెచ్చరిక జారీ చేస్తారు. రెండవ సారి పట్టుబడితే ఫోన్​ స్వాధీనం చేసుకుని అందులోని చిత్రాలు, వీడియోలను డిలీట్​ చేస్తామని దేవస్థాన బోర్డు తెలిపింది.

ఇదీ చూడండి : స్వామి నిత్యానంద కోసం ప్రత్యేక 'హిందూకైలాస' దేశం..!

Last Updated : Dec 4, 2019, 11:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details