దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా మార్చి 21నుంచి ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారుల ఈ రోజు కార్యాలయాలకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించినున్న నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూనే విధులు నిర్వర్తించినట్లు తెలిపారు మంత్రులు.
" లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచే విధులు నిర్వహించాను. చాలా రోజుల తర్వాత ఈరోజే శాస్త్రి భవన్లోని ఆఫీస్కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మోదీ ప్రభుత్వం అన్ని చర్యలతో సిద్ధంగా ఉంది."
-ప్రహ్లాద్ జోషీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి.