కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు తప్పా.. మిగతా షాపులన్నీ మూతపడ్డాయి. అయితే, కొంతమంది ఈ నిత్యావసర వస్తువుల ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారు. దిల్లీలో ఇలాగే ఓ పాలవ్యాపారి.. తన పాలక్యాన్లలో అక్రమంగా మద్యం తీసుకెళ్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
పాలక్యాన్లలో మద్యం సీసాలు.. దిల్లీలో వ్యాపారి నిర్వాకం ఇదీ జరిగింది..
బులంద్శహర్కు చెందిన బాబీ.. తన ద్విచక్రవాహనంపై పాల్క్యాన్లు తీసుకెళ్తూ సౌత్ ఎవెన్యూ రోడ్ చెక్పోస్ట్ వద్ద పోలీసుల కంటపడ్డాడు. కానీ.. అతను బైక్ ఆపకుండా ముందుకు వెళ్లినందున అర్ధరాత్రి సమయంలో పాలు తీసుకెళ్లడమేంటనే అనుమానంతో వెంబడించారు. ఎట్టకేలకు రాష్ట్రపతి భవన్- నాలుగో నంబర్ గేట్ వద్ద పోలీసులకు చిక్కాడు.
పాల క్యాన్ ఓపెన్ చేసి చూస్తే అందులో 7 మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు పోలీసులు. అనంతరం వాటిని సీజ్ చేసి.. అంటువ్యాధుల చట్టం, దిల్లీ అబ్కారీ చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:నోట్ల రద్దు తరహాలోనే లాక్డౌన్ విఫలమైంది: కమల్