తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2019, 9:15 PM IST

Updated : Nov 17, 2019, 12:05 AM IST

ETV Bharat / bharat

గవర్నర్​తో ఎన్సీపీ, కాంగ్రెస్, సేన నేతల భేటీ వాయిదా

మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీతో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతల సమావేశం వాయిదా పడింది. పార్టీల ముఖ్యనేతలు.. ఇతర ముఖ్య పనుల్లో ఉండటమే కారణంగా పేర్కొంది శివసేన.

గవర్నర్​తో ఎన్సీపీ, కాంగ్రెస్, సేన నేతల భేటి వాయిదా

మహారాష్ట్రలో వరదల కారణంగా రైతులకు కలిగిన నష్టంపై రాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కోశ్యారీతో చర్చించేందుకు నేడు సమావేశం కావాలని నిర్ణయించినప్పటికీ.. ఈ భేటీని వాయిదా వేశాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​. వ్యవసాయ సమస్యలపైన చర్చించేందుకేనని ఆయా పార్టీల నేతలు చెప్పుకొస్తున్నప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసమేననే ఊహాగానాలు ఉన్నాయి.
భాజపాతో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్​, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది శివసేన. ఆ పార్టీలతో కలిసి కనీస అవగాహన ఒప్పందాన్ని
ఇప్పటికే పూర్తి చేసింది.

పార్టీల ముఖ్యనేతలు ఇతర పనుల్లో ఉన్నందునే గవర్నర్​తో భేటీ వాయిదా పడినట్లు తెలిపారు శివసేన నేత ఏక్​నాథ్​ షిందే.

"ఈ రోజు మూడు పార్టీల నాయకులు గవర్నర్​తో భేటి కావాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం కురిసిన అధిక వర్షాల కారణంగా రైతులకు తీరని నష్టం వాటిల్లింది. మూడు పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల పరిధిలో వరదల పరిస్థితి, నష్టాన్ని అంచనా వేసే పనిలో తీరిక లేకుండా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్​తో భేటీ వాయిదా పడింది. త్వరలోనే తదుపరి భేటీ తేదీని ప్రకటిస్తాం."
-ఏక్​నాథ్​ షిందే, శివసేన నేత.

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా పంటలు నాశనమయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టం జరిగిన ప్రాంతంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​.. నవంబరు 2న నష్ట పరిహారం కింద రూ.10వేల కోట్లను అందిస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత 12వ తేదీ నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.

ఇదీ చూడండి:'పార్లమెంట్​ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలి'

Last Updated : Nov 17, 2019, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details