పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో ప్రేయసి తల్లిదండ్రులను చంపేశాడు ఓ కిరాతకుడు. ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి తల్లిదండ్రులను చంపేశాడు! - ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రేమికుడు
ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహానికి అంగీకరించలేదనే కోపంతో ఓ ప్రేమికుడు తన ప్రియురాలి తల్లిదండ్రులను పొడిచి చంపేశాడు.
ఇదీ జరిగింది...
సుల్తాన్‌పుర్ జిల్లా జైసింగపూర్ బ్లాక్‌లోని సలార్పుర్ గ్రామంలో నివాసముంటున్న ఓ యువజంట రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సోమవారం రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి వారి ప్రేమ సంగతి తెలిపి పెళ్లికి ఒప్పుకోవాలని కోరాడు యువకుడు. ప్రియురాలి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన యువకుడు వారిని పొడిచి చంపేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.