తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలీవుడ్​ యువ నటిని వేధించిన వ్యక్తికి మూడేళ్ల జైలు - bollywood molesting news

బాలీవుడ్​ నటితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ముంబయిలోని ప్రత్యేక కోర్టు. విమానంలో వెళ్తుండగా తనను వేధించాడని 2017లో ఫిర్యాదు చేసింది ఆ యువ నటి.

Man gets 3-yr RI for molesting former actor on flight
బాలీవుడ్​ యువనటిని వేధించిన వ్యక్తికి మూడేళ్ల జైలు

By

Published : Jan 15, 2020, 3:49 PM IST

విమానంలో ప్రయాణిస్తుండగా బాలీవుడ్​ యువ నటిని వేధించిన ఓ వ్యక్తికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసు వాదనలు పూర్తయిన అనంతరం శిక్షను ఖరారు చేశారు ప్రత్యేక జడ్జి ఏడీ దేవ్.

2017లో ఘటన

2017 డిసెంబరులో ఎయిర్​ విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న తనను తోటి ప్రయాణికుడు వేధించాడని బాలీవుడ్ యువనటి ఆరోపించింది. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​లో సవివరంగా పోస్ట్​ చేసింది. వెనుక సీటులో కూర్చున్న ఓ మధ్య వయసున్న వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన దృశ్యాలను ఫోన్​లో రికార్డు చేద్దామనుకున్నప్పటికీ.. వెలుతురు సరిగా లేని కారణంగా చేయలేకపోయినట్లు చెప్పింది.

ఆ ఘటన జరిగినప్పటికి ఆ బాలీవుడ్​ యువనటి వయసు 17ఏళ్లు. ఆమె మైనర్​ అయినందున నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

సినిమాల్లో నటించబోనని గతేడాది ప్రకటించింది ఈ బాలీవుడ్ నటి.

ఇదీ చూడండి: ఆహా: 1995 కేజీల కిచిడీతో గిన్నిస్​ రికార్డు

ABOUT THE AUTHOR

...view details