తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం- ఒకరు మృతి - fire breaks out

నిర్మాణంలో ఉన్న భారత నావికాదళ యుద్ధనౌకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబయిలోని మాజ్​గావ్​ ఓడరేవులో సంభవించిన ఈ ప్రమాదంలో చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

భారత నావికాదళ యుద్ధనౌకలో భారీ అగ్నిప్రమాదం

By

Published : Jun 21, 2019, 9:27 PM IST

Updated : Jun 21, 2019, 10:07 PM IST

భారత నావికాదళ యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం

ముంబయిలోని మాజ్​గావ్​ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భారత నావికా దళానికి చెందిన యుద్ధనౌకలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని గాయాలపాలైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Jun 21, 2019, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details