మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి గోవా రహదారిపై కొలెటివాడి గ్రామం వద్ద ఎదురెదురుగా వెళ్తున్న బస్సు, ఎకో కార్ ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
నాగోథానే ప్రాంతం నుంచి ముంబయికి వెళ్తున్న ఎకో కార్... కొలెటివాడికి చేరుకోగానే ఎదురుగా వస్తోన్న బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.