తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2019, 8:15 PM IST

ETV Bharat / bharat

ఆత్మహత్యకు దారితీసిన ఆన్​లైన్​ ఆట!

మీ పిల్లలు సమయం తెలియకుండా ఫోన్​లో మునిగిపోతున్నారా.. ఇంట్లో అందరూ పడుకున్నా.. వారు మాత్రం మొబైల్​లో ఆటలాడుతున్నారా? అయితే జాగ్రత్త..! మొబైల్​కు బానిసలై,  ప్రమాదకర ఆటల మోజులో పడి చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ తరం యువకులు. ఇటీవల మహారాష్ట్రలో ఓ యువకుడి ఆత్మహత్యకూ అలాంటి ఆటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆత్మహత్యకు దారితీసిన ఆన్​లైన్​ ఆట!

ఆత్మహత్యకు దారితీసిన ఆన్​లైన్​ ఆట!
మహారాష్ట్ర పుణెలో 19 ఏళ్ల దివాకర్​ మాలీ​ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి గదిలో ఓ ఉత్తరం దొరికింది. అందులో తల్లిదండ్రులకు, స్నేహితులకు గానీ ఎలాంటి చివరి సందేశం లేదు. 'సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు. నల్ల చిరుతకు విముక్తి కలిగింది, ముగింపు' అని అర్థం కాకుండా ఏదో రాసుంది. ఈ ఉత్తరాన్ని బట్టి మొబైల్​లో ఏదో ఆన్​లైన్​ ఆట అతడి ఆత్మహత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ​

దివాకర్​ చనిపోయే ముందు తన ప్రవర్తనలో మార్పు.. మొబైల్​లో ఉన్న కోడ్​ భాషలు, ఫేస్​బుక్​, వాట్సాప్ డీపీల్లోనూ ఉత్తరంలో రాసిన బ్లాక్​ పాంథన్​ (నల్ల చిరుత) చిత్రాలే ఉండడం పోలీసుల అనుమానాన్ని బలపరుస్తున్నాయి.

"మాలీ కుటుంబసభ్యులు పెర్నే ఫటా పట్టణంలో నివాసముంటారు. దివాకర్​ వఘోలీలోని కామర్స్​ కాలేజ్​లో ఇంటర్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా రాత్రంతా కూర్చుని అతనేదో ఆన్​లైన్​ ఆట ఆడుతున్నాడు. రెండు రోజులుగా కాలేజ్​కి వెళ్లడం లేదు. ఆకస్మాత్తుగా తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆడిన ఆటేదో తెలియాల్సి ఉంది."
-పోలీస్​ అధికారి.

బ్లూవేల్స్​ అనే ఆన్​లైన్​ ఆట అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రాణాలు బలిగొంది. ఒక్కసారి ఆ యాప్​ను ఇన్​స్టాల్​ చేస్తే ఎవరైనా ఆ ఆటకు బానిస కావాల్సిందే. ఒక్కో లెవల్​లో ఒక్కో ఛాలెంజ్​తో చివరికి వారిని చనిపోయేలా చేస్తుంది. అయితే ఇలాంటి ప్రమాదకరమైన ఆన్​లైన్​ ఆటలను ప్రంచమంతా నిషేధించినా.. అక్రమంగా అలాంటి ఆటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. 'బ్లాక్​ పాంథన్'​ కూడా ఇలాంటి ఆటే అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:మీసం కత్తిరించారని సెలూన్​పై కేసు!

ABOUT THE AUTHOR

...view details