తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2020, 6:29 AM IST

Updated : Jul 7, 2020, 7:31 AM IST

ETV Bharat / bharat

బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

మహారాష్ట్రలో ఓ ఉపాధ్యాయుడు బడిలో పంట పండిస్తున్నాడు. అదేంటి పాఠాలు చెప్పకుండా వ్యవసాయం చేయడమేంటి అనుకుంటున్నారా? ఆయన సేద్యం చేస్తోంది పిల్లల చదువుకోసమేనండీ.! ఊర్లో పని దొరక్క, పిల్లలను తీసుకుని వలస వెల్లిపోదామనుకున్న తల్లిదండ్రులను ఆపేందుకే​ ఈ ఉపాయం చేశాడాయన.

Maharashtra teacher starts 'school farm' to prevent migration
బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

ఏటా ఎందరో పేదలు నగరాలకు వలసపోవడం.. అక్కడ ఇటుకలు మోస్తూ.. కూలీ పనులు చేస్తూ.. చాలీచాలని సంపాదనలతో బతుకీడ్చడం చూస్తూనే ఉంటాం. మహారాష్ట్ర పాల్ఘర్​లోని ఓ గ్రామంలోనూ పని దొరక్క, వ్యవసాయం చేసేకుందామన్నా భూమి లేక.. పట్నం బాట పట్టిన కటుంబాలను ఆపాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. బడినే వ్యవసాయ క్షేత్రంగా మార్చి వారికి ఊర్లోనే ఉపాధి కల్పించాడు.

బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

పిల్లల చదువు కోసం...

బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!
బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

కొమర్​పడా తాలూకా, డొల్హారి బుద్రుక్​ గ్రామంలోని జిల్లా పరిషత్​ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు బాబు చంగ్​దేవ్​ మోరే. 2016లో స్థానిక వ్యవసాయాధికారుల సహకారంతో కొన్ని విత్తనాలు తెచ్చి బడి ఆవరణలో చల్లడం ప్రారంభించాడు. అదే సమయంలో.. బడిలో చదివే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోవడం గమనించాడు. గ్రామంలో ఏటా కనీసం 35 కుటుంబాలు.. పట్టణానికి వలసపోతున్నారని గ్రహించాడు. వారితో పాటే పిల్లల చదువులు ప్రమాదంలో పడుతున్నాయని తెలుసుకుని ఓ ఆలోచన చేశాడు.

బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

బడిలోనే సాగు...

సహోద్యోగి సంతోష్​ పాటిల్​తో కలిసి... స్కూల్​ ఆవరణలో వ్యవసాయం ప్రారంభించాడు మోరే. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించి బడి పొలంలో వారిచేత సేద్యం చేయించాడు. వచ్చిన దిగుబడినంతా వారే విక్రయించుకునేలా ఏర్పాటు చేశాడు. దీంతో, వలస వెళ్దామనుకున్నవారికి గ్రామంలోనే జీవనోపాధి లభించింది.

బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

ఇప్పుడు ఈ బడి పొలంలో బెండకాయ, వంకాయ, పాలకూర, అల్లం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు పండుతున్నాయి. లాక్​డౌన్ వేళ వీరి వ్యవసాయ ఉత్పత్తులకు స్థానికంగా డిమాండ్ ఏర్పడింది. మోరే ఆశయానికి మంచి స్పందన లభించింది. వలసలు ఆపేందుకు వ్యవసాయం చేస్తున్న మోరే​కు కొన్ని ఎన్​జీఓల సహకారమూ అందింది. అక్షరధార అనే ఓ సేవా సంస్థ ఉల్లిపాయల సాగుకు రూ. 1.35 లక్షలు విరాళంగా ఇచ్చింది.

బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

ఇప్పుడు, ఆ జిల్లా పరిషత్ పాఠశాల​ పేరు చుట్టుపక్కల గ్రామాల్లో మారుమోగుతోంది. ప్రైవేటు పాఠశాలలకు పంపాలనుకున్నవారు కూడా తమ పిల్లలను ఈ వ్యవసాయం నేర్పే ప్రభుత్వ బడిలో చేర్చుతున్నారు. ఫలితంగా.. 2018 నుంచి బడిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

ఇదీ చదవండి: మాస్కు లేకపోతే వలంటీర్లుగా మారాల్సిందే!

Last Updated : Jul 7, 2020, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details