మధ్యప్రదేశ్లోని పలుప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వరదలు పొంగిపొర్లుతున్నాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాజాపుర్ జిల్లా కేంద్రంలోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. ఆ ప్రాంతంలో వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్లో నీటమునిగిన వందల ఇళ్లు - rains
మధ్యప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శాజాపుర్ జిల్లా కేంద్రంలో వందలాది ఇళ్లు నీటి మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు జలమయమై పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మధ్యప్రదేశ్లో నీటమునిగిన వందలాది ఇళ్లు
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సిబ్భంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
మధ్యప్రదేశ్లో నీటమునిగిన వందలాది ఇళ్లు
Last Updated : Jul 28, 2019, 5:02 PM IST