తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉభయసభలు వాయిదా.. 'అల్లర్ల'పై రాజ్యసభలో గందరగోళం - rajyasabha adjourn

పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. జేడీయూ ఎంపీ వైద్యనాథ్ ప్రసాద్ మృతికి సంఘీభావంగా లోక్​సభ.. దిల్లీ ఘర్షణలపై గందరగోళం నేపథ్యంలో రాజ్యసభ కార్యకలాపాలను వాయిదా వేశారు. మరోవైపు దిల్లీ హింసపై కేంద్రం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు.

adjourn
ఉభయసభల వాయిదా.. అల్లర్లపై రాజ్యసభలో గందరగోళం

By

Published : Mar 2, 2020, 12:48 PM IST

Updated : Mar 3, 2020, 3:44 AM IST

పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాపడ్డాయి. లోక్​సభ ప్రారంభం కాగానే జేడీయూ సభ్యుడు వైద్యనాథ్ ప్రసాద్ మహతో ఇటీవల మృతి చెందగా ఆయనకు నివాళులర్పించారు స్పీకర్ ఓం బిర్లా, సభ్యులు. సంతాప సూచకంగా సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు సభాపతి.

ఫిబ్రవరి 28న మృతి చెందిన వైద్యనాథ్..​ బిహార్​లోని వాల్మీకినగర్​ నియోజకవర్గం నుంచి దిగువసభకు ప్రాతినిధ్యం వహించారు.

దిల్లీ ఘర్షణలపై రాజ్యసభ..

సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలో చెలరేగిన ఘర్షణలపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సమయానుకూలంగా చర్చ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు సభాకార్యకలాపాలు కొనసాగించేందుకు సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు వెంకయ్య. అయితే విపక్ష సభ్యులు ఘర్షణలపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు గంటలవరకు సభను వాయిదా వేశారు ఛైర్మన్.

విపక్షాల నిరసన..

ఉభయసభలు వాయిదా పడిన నేపథ్యంలో విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. దిల్లీ ఘర్షణలపై ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరీ, శశి థరూర్, ఆప్​, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

విపక్షసభ్యుల నిరసన

ఇదీ చూడండి:కొత్తరకం కట్నం కోరిన ఐఏఎస్ అధికారి!

Last Updated : Mar 3, 2020, 3:44 AM IST

ABOUT THE AUTHOR

...view details