తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెప్పాపెట్టకుండా ఇంట్లోకి దూరిన చిరుత - cheetha in house kurtch

ఒక్కోసారి ఇంటికి అనుకోని అతిథులు వస్తుంటారు కదూ.. అలాంటి ఓ అతిథే గుజరాత్​లోని ఓ ఇంట్లోకి చెప్పాపెట్టకుండా వచ్చి యజమానినే బెంబేలెత్తించింది. అతిథి వస్తే భయపడడం దేనికని అనుకుంటున్నారా? వచ్చింది చిరుతపులి మరి.. హడలిపోక ఏం చేస్తారు!

leopard enters a house in godhiyar village of kutch
చెప్పాపెట్టకుండా ఇంట్లోకి దూరిన చిరుత!

By

Published : Jan 20, 2020, 12:42 PM IST

గుజరాత్​ కుఛ్​​ జిల్లా గోధియార్​ గ్రామంలో సోదాహీ​ర్​జీ వర్ధాజీ ఇంటికి తెల్లవారుజామున ఓ చిరుత పులి వచ్చింది.

చెప్పాపెట్టకుండా ఇంట్లోకి దూరిన చిరుత!
వర్ధాజీ బయటికెళ్లినప్పుడు ఇంట్లోకి చొరబడిందా వ్యాఘ్రం. బాగా ఆకలి మీద ఉందేమో ఇల్లంతా ఆహారం కోసం శోధించింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల కాస్త నిరాశ చెందింది.అటూ ఇటు వెతికి.. ఎదురుగా ఏదో నున్నగా ఉందే అనుకొని గోడను కొరికిచూసింది. అదీ దాని ఆకలి తీర్చలేదనుకుని తెలుసుకుని ఊరుకుంది. అనంతరం.. పులిని ఇంట్లో గమనించిన యజమాని అటవీ అధికారులకు సమాచారం అందించగా ప్రస్తుతం ఆ చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు.
చెప్పాపెట్టకుండా ఇంట్లోకి దూరిన చిరుత!

ABOUT THE AUTHOR

...view details