తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ సారథిపై స్పష్టత లేమి బాధాకరం' - కాంగ్రెస్

కాంగ్రెస్ భవితవ్యంపై ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ముఖాముఖి ఇచ్చిన థరూర్ రాహుల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారా లేదా... అనే అంశం పార్టీ అగ్రనాయకత్వాన్ని, కార్యకర్తలను బాధిస్తోందన్నారు.

కాంగ్రెస్ భవితవ్యంపై శశిథరూర్ వ్యాఖ్యలు

By

Published : Jul 28, 2019, 3:55 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతున్నారా లేదా అనే అంశం పార్టీ అగ్రనాయకత్వాన్ని బాధిస్తోందన్నారు ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్. పార్టీలో వర్కింగ్ కమిటీ సహా అన్ని కీలక పదవులకు ఎన్నికల విధానమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో కాంగ్రెస్ భవితవ్యంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

పార్టీకి అధ్యక్షుడిగా యువనేతను ఎన్నుకోవడం సరైనదన్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యలను థరూర్ సమర్థించారు.

ప్రియాంక రాక కోసం..

పార్టీ అంతర్గత ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు థరూర్. కానీ తుది నిర్ణయం గాంధీ కుటుంబ సొంత విషయమని వ్యాఖ్యానించారు.

ప్రియాంకను నాయనమ్మ ఇందిరాగాంధీతో చాలామంది పోల్చి చూస్తుంటారని, ఆమె అధ్యక్ష బరిలో నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ సారథి ఉండరన్న రాహుల్ వ్యాఖ్యలు ప్రియాంక పోటీ చేయబోరన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయని స్పష్టం చేశారు.

స్పష్టత లేకపోతే మరింత నష్టం

కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో స్పష్టత లేకపోవడం కారణంగా కార్యకర్తలు మనోస్థైర్యం కోల్పోయే అవకాశం ఉందన్నారు శశి థరూర్.

'సీడబ్ల్యూసీ సరైన నిర్ణయం తీసుకోవాలి'

ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితిని సీడబ్ల్యూసీ తీవ్రంగా పరిగణించాలన్నారు థరూర్. ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మధ్యంతరంగా కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించి సీడబ్ల్యూసీని రద్దు చేయాలని ఆకాంక్షించారు థరూర్. అనంతరం తాజా కార్యవర్గంకోసం ఎన్నికలకు వెళ్లాలన్నారు.
ఏఐసీసీ, పీసీసీ సభ్యుల ఓటింగ్ ద్వారా పార్టీకి అధ్యక్షుడిని ఎన్నిక చేయడం వల్ల నూతన సారథికి పార్టీపై పట్టు ఉండే అవకాశం ఉందని విశ్లేషించారు.

తన అభ్యర్థిత్వంపై..

థరూర్ పోటీ చేస్తారా అన్న వ్యాఖ్యలకు అది అసాధ్యమని సమాధానమిచ్చారు ఈ కేంద్ర మాజీ మంత్రి.

ఇదీ చూడండి: కుక్కపై గోమాత వాత్సల్యం.. పాలిచ్చిన వైనం!

ABOUT THE AUTHOR

...view details