తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీడియాను బహిష్కరించిన కుమారస్వామి - బహిష్కరణ

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్​డీ. కుమారస్వామి మీడియాను బహిష్కరించి మరోసారి వార్తల్లో నిలిచారు. మండ్య లోక్​సభ ఎన్నికల్లో మీడియా.. ఎక్కువగా సుమలతపైనే దృష్టి సారించిందనే అసంతృప్తితోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మీడియాను బహిష్కరించిన సీఎఁ

By

Published : Apr 29, 2019, 6:41 AM IST

మండ్య లోక్​సభ ఎన్నికల్లో మీడియా కవరేజీ విషయంపై నిరాశతో ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఆదివారం ఒక్కసారిగా మీడియాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మండ్యలో ఆయన కుమారుడు నిఖిల్​ గౌడ... స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలత అంబరీశ్​పై పోటీ చేశారు.

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్​ను... కుమారస్వామి ఆదివారం కలిసిన అనంతరం మీడియా ఎదురుపడింది. భేటీపై ప్రశ్నిస్తుండగా సీఎం ఒక్కసారిగా 'నేను మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను' అని వ్యాఖ్యలు చేశారు.

'మీరు ఒక వార్త కోసం.. ఎంతవరకైనా వెళ్తారు కదా.. వెళ్లండి.. ఎంజాయ్​ చేయండి' అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అసలు కారణం ఏమిటో తెలియదు కానీ.. మండ్య ఎన్నికల్లో మీడియా కవరేజీపైనే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కర్ణాటక సీఎం ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది నవంబర్​లోనూ 'ఏ విషయంపైనైనా విలేకరుల సమావేశం నిర్వహించబోనని' మీడియాను బహిష్కరించి వార్తల్లో నిలిచారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విషయంలో మీడియాపై ఇటీవల విమర్శలు గుప్పించారు కన్నడ ముఖ్యమంత్రి. మోదీ అందంగా మేకప్​ చేసుకుంటారు కనుకే... మీడియా కేవలం ఆయననే చూపిస్తుంది అని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details