తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీని ప్రశంసించాలా..? శశీ వివరణ ఇవ్వండి' - seeks explanation from Tharoor

మోదీ మంచి పనులు చేస్తే ప్రశంసించాలంటూ ఆ పార్టీ ఎంపీ శశి థరూర్​ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది కేరళ ప్రదేశ్ కాంగ్రెస్​ కమిటీ. థరూర్ వైఖరి పట్ల పార్టీ అగ్ర నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.

మోదీని ప్రసంశించాలంటారా.. శశీ వివరణ ఇవ్వండి: కేపీసీసీ

By

Published : Aug 28, 2019, 6:41 PM IST

Updated : Sep 28, 2019, 3:25 PM IST

మోదీకి మద్దతుగా మాట్లాడాలంటూ కాంగ్రెస్​ అగ్రనేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై​ వివరణ ఇవ్వాలని కేరళ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ కోరింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు పార్టీ నేతలు కలిశారని కేరళ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు ముళ్ళపల్లి రామ్​చంద్రన్ అన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల, మరో ముగ్గురు పార్టీ ఎంపీలు - కె. మురళీధరన్, బెన్నీ బెహన్నన్, టి. ఎన్. ప్రతాపన్...​ థరూర్​ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

థరూర్​ వ్యాఖ్యలు లక్షల మంది కాంగ్రెస్​ కార్యకర్తలకు బాధ కల్గించాయి. ఇది పార్టీకి మంచిది కాదు. పార్టీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించిందని, వెంటనే ఆయన సంజాయిషీ ఇవ్వాలని పలువురు డిమాండ్​ చేశారు.

-రామచంద్రన్​, కేపీసీసీ చీఫ్​

విదేశీ పర్యటనలో ఉన్న థరూర్​ స్పందిస్తూ మోదీ ప్రభుత్వం పట్ల నేను తీవ్ర విమర్శకుడిని. తోటి పార్టీ నేతలంతా తన వైఖరిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. రాజ్యాంగం పట్ల ఉన్న నిబద్ధత, తాను పాటించిన నైతిక విలువలు ఇప్పటికి 3 సార్లు ఎన్నికలలో తనను గెలిపించాయని ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి : కరాచీలోని 3 గగనతలాల్ని మూసేసిన పాకిస్థాన్

Last Updated : Sep 28, 2019, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details