తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిరసనలపై విపక్షాలు పెట్రోల్​ చల్లుతున్నాయి'

'పౌర' నిరసనలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి స్పందించారు. నిరసనలపై ప్రతిపక్షాలు పెట్రోల్​ పోస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వ చట్ట సవరణ వల్ల ఏ ఒక్క భారతీయుడికీ నష్టం జరగదని స్పష్టం చేశారు.

KISHAN REDDY SPEAKS ON CAA PROTESTS AND ACCUSES OPPOSITION PARTIES.
పౌరట నిరసనలపై కిషన్​ రెడ్డి స్పందన

By

Published : Dec 19, 2019, 10:22 PM IST

పౌరసత్వ చట్ట సవరణ విషయంలో విపక్షాలు ఆందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నిరసనలపై ప్రతిపక్షాలు.. పెట్రోల్ చల్లుతున్నాయని మండిపడ్డారు. మతం పేరుతో విద్యార్థులను, మహిళలను, ఇతర వర్గాలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. దిల్లీ, లఖ్‌నవూ మినహా దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉందన్న కిషన్ రెడ్డి.. వదంతులను వ్యాప్తిచేయవద్దని విపక్షాలకు సూచించారు. కొత్తగా వచ్చే చట్టం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్‌లలో మతహింసకు గురై భారత్‌కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుందే తప్ప.... ఎవరి పౌరసత్వాన్ని లాక్కొదని స్పష్టం చేశారు....

లఖ్‌నవూ మినహా ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదు. శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టాన్ని కొన్ని మతాలకు, ప్రాంతాలకు, భాషలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. నేను రాజకీయ పార్టీలకు ఒకటే చెప్పదలుచుకున్నా. ఆందోళనలు జరుగుతుంటే....మీరు వాటిపై పెట్రోల్ చల్లకండి. వదంతులు వ్యాపింపజేయకండి.
కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

ఇదీ చూడండి: 'ప్రతీకారం తీర్చుకుంటాం'- నిరసనకారులకు యోగీ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details