తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో రోజూ 20 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో మళ్లీ బాధితులు పెరిగిపోతున్నారు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4,696 మందికి వైరస్​ సోకింది. కర్ణాటక, దిల్లీలోనూ మహమ్మారి వ్యాప్తి అదుపులోకి రావడం లేదు.

By

Published : Sep 20, 2020, 9:22 PM IST

Kerala records highest single-day spike of 4,696 coronavirus cases
కేరళలో రికార్డు స్థాయిలో 4,696 కేసులు

మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం 20 వేల 598 కేసులు నమోదయ్యాయి. మరో 455 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 32 వేల 671కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల 8 వేల 642 కేసులున్నాయి. ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం వెల్లడించింది.

కర్ణాటకలో మరో 8,191 మంది వైరస్​ బారినపడగా.. 101 మంది మరణించారు. రాష్ట్రంలో ఒక్కరోజే 8,611 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 98 వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి.

తమిళనాడులో మరో 5,516 కేసులు.. 60 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 5.41 లక్షల కేసుల్లో.. లక్షా 55 వేలకుపైగా రాజధాని చెన్నైలోనే ఉన్నాయి.

కేరళలో కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ మరో 4,696 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.35 లక్షలు దాటాయి. మొత్తం 535 మంది కొవిడ్​కు బలయ్యారు.

  • దిల్లీలో మళ్లీ రోజువారీ కేసులు 4 వేల దిగువకు చేరాయి. ఇవాళ 3,812 కరోనా కేసులను గుర్తించారు. మరో 37 మంది మరణించారు. రాష్ట్రంలో గత 5 రోజులుగా 4 వేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి.
  • బంగాల్​లో కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం 3 వేల 177 మంది కొవిడ్​ బారినపడ్డారు. మరో 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • గుజరాత్​లో 1,407 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 17 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details