సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. సింగపూర్ అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం (ఎస్ఐసీసీ)కి జడ్జిగా జస్టిస్ సిక్రీ నియమితులయ్యారు. ఈ మేరకు సింగపూర్ అధ్యక్షుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడాది ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించనున్నారు సిక్రీ. 2021 జనవరి 4తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. సింగపూర్ అత్యున్నత న్యాయస్థానానికి ఎస్ఐసీసీ ఒక విభాగం. వాణిజ్య పరమైన వివాదాలను ఈ న్యాయస్థానం స్వీకరిస్తుంది. ఈ కోర్టులో అంతర్జాతీయ న్యాయమూర్తుల ప్యానెల్లో 16 మంది ఉన్నారు.