తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏబీవీపీ, ఎస్​ఎస్​యూఐ సభ్యుల ఘర్షణ- 10 మందికి గాయాలు - దిల్లీ జేఎన్​యూలో విద్యార్థులపై దాడి

దిల్లీ జేఎన్​యూలో విద్యార్థులపై దాడి వ్యవహారం... గుజరాత్​లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణకు కారణమైంది. అహ్మదాబాద్​లో ఏబీవీపీ కార్యాలయం ఎదుట ఎన్​ఎస్​యూఐ సభ్యులు ఆందోళనకు దిగగా... ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు.

JNU violence: ABVP, NSUI members clash in Guj, over 10 injured
ఏబీవీపీ, ఎస్​ఎస్​యూఐ సభ్యుల ఘర్షణ- 10 మందికి గాయాలు

By

Published : Jan 7, 2020, 5:59 PM IST

గుజరాత్​ అహ్మదాబాద్​లో అఖిల భారత విద్యార్థి పరిషత్​(ఏబీవీపీ) సభ్యులు, ప్రత్యర్థి నేషనల్ స్టూడెంట్స్​ యూనియన్ ఆఫ్​ ఇండియా (ఎన్​ఎస్​యూఐ) సభ్యులు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో 10 మందికి గాయాలయ్యాయి.

దిల్లీ జేఎన్​యూలో ఆదివారం విద్యార్థులపై దుండగులు దాడిని తప్పుబడుతూ పాల్దీ ప్రాంతంలోని ఏబీవీపీ కార్యాలయం వద్ద ఎన్​ఎస్​యూఐ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తరుణంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఏబీవీపీ, ఎస్​ఎస్​యూఐ సభ్యుల ఘర్షణ- 10 మందికి గాయాలు

ఇదీ చూడండి:న్యూయార్క్​​ కోర్టులకు జడ్జీలుగా దీప, అర్చన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details