తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతా బలగాల కాల్పుల్లో జైషే కమాండర్​ హతం - జైషే మహ్మద్

జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒకరు జైషే కమాండర్​గా పోలీసులు గుర్తించారు.

భద్రతా బలగాల కాల్పుల్లో జైషే కమాండర్​ హతం

By

Published : Jul 30, 2019, 8:58 PM IST

జమ్ము కశ్మీర్​లో మరో మారు భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంత్​నాగ్​లో జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు జైషే మహ్మద్​ ఉగ్రవాదులు మరణించారు. ఇందులో ఒక ముష్కరుడు సంస్థ కమాండర్​గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

"అనంత్​నాగ్​లోని బిజ్​బెహరాలో జైషే కమాండర్​ ఫయాజ్​ పంజూతో పాటు అతని సహాయకుడు ఎన్​కౌంటర్​లో మరణించారు. పంజూను మట్టుబెట్టడం ఓ గొప్ప విజయం."

- పోలీసు అధికారి

అనంత్​నాగ్​ పట్టణంలో జూన్​ 12న జరిగిన ఉగ్రదాడిలో పంజూ కీలకంగా వ్యవహరించాడు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లతో పాటు ఓ పోలీసు అధికారి మృతి చెందారు.

ఇదీ చూడండి: మళ్లీ పాక్ కవ్వింపు చర్యలు.. భారత జవాను బలి

ABOUT THE AUTHOR

...view details