తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు ఉగ్రవాదులు హతం - హంద్వారా

హంద్వారా ప్రాంతంలో భద్రతా బలగాలకు-ఉగ్రమూకకు మధ్య కాల్పులు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు ప్రకటించారు.

భద్రతా బలగాలు

By

Published : Mar 3, 2019, 10:29 AM IST

Updated : Mar 3, 2019, 12:14 PM IST

జమ్ముకశ్మీర్​ హందార్వాలో శుక్రవారం ప్రారంభమైన ఎన్​కౌంటర్​ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాల్పుల్లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఆరుకు చేరింది. శుక్రవారం ఇద్దరు సీఆర్పీఎఫ్​ జవాన్లు, ఇద్దరు జమ్ముకశ్మీర్​ పోలీసులు అమరులయ్యారు. నిన్న ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సీఆర్పీఎఫ్​ జవాను... చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.

తీవ్రవాదులు ఎంతమంది చనిపోయారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

కుప్వారా జిల్లా హందార్వాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తీవ్రవాదులకు-జవాన్లకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.

Last Updated : Mar 3, 2019, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details