తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో బాలుడ్ని కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు - బందీపొర

జమ్ముకశ్మీర్​లో రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు మృతి చెందారు. బందీగా తీసుకున్న ఆతిఫ్ అహ్మద్​ అనే బాలుడిని ముష్కరులు కిరాతకంగా చంపేశారు.

ఐదుగురు ముష్కరులు హతం

By

Published : Mar 22, 2019, 6:06 PM IST

ఐదుగురు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్​లో గత మూడు రోజులుగా భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన వేర్వేరు ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు మృతి చెందారు.

ఉగ్రవాదుల కిరాతక చర్య...

బందిపొర జిల్లా హజీన్​లో గురువారం సాయంత్రం బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. బలగాల్ని నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు బాలల్ని అడ్డం పెట్టుకున్నారు ముష్కరులు. అందులో ఒకరిని గురువారం సాయంత్రం బలగాలు రక్షించగలిగాయి. మరో బాలుడు ఆతిఫ్ అహ్మద్​ను ముష్కరులు కిరాతకంగా హత్య చేశారు. అనంతరం కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

మరో రెండు...

షోపియాన్​ జిల్లాలో తనిఖీలు చేస్తున్న పోలీసులపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందాడు.
బారాముల్లా జిల్లా కలంతారాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details