తెలంగాణ

telangana

జామియా కాల్పులు: 'అంతా క్షణాల్లో జరిగిపోయింది'

By

Published : Jan 31, 2020, 7:56 AM IST

Updated : Feb 28, 2020, 3:05 PM IST

దిల్లీ జామియా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటనను విద్యార్థులతో పాటు ఆమ్​ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన పోలీసు విభాగం... కాల్పుల ఘటన క్షణాల్లో జరిగిపోయిందని వెల్లడించారు. కేసును నేర విభాగానికి బదిలీ చేశామని.. నిందితుడు మైనరా, కాదా అన్న కోణంలోనూ తాము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Jamia firing: Police says incident happened in seconds; personnel didn't have time to react
అంతా క్షణాల్లోనే జరిగిపోయింది: జామియా పోలీస్​ విభాగం

దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటన క్షణాల్లో జరిగిపోయిందని తెలిపారు పోలీసులు. సీఏఏ, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా శాంతియుత మార్గంలో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరగినందున... జామియా విద్యార్థులతో పాటు ఆప్​ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదురయ్యాయి. దుండగుడు కాల్పులు జరుపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజా ప్రకటన చేశారు.

" పోలీసులు స్పందించే సమయానికి నిందితుడు కాల్పులు జరిపాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేసును నేర విభాగానికి బదిలీ చేశాం. కాల్పులు జరిపిన వ్యక్తి మైనరా, కాదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం."
- ప్రవీణ్​ రంజన్​, ప్రత్యేక పోలీస్​ కమిషనర్​

గురువారం కాల్పులు...

గురువారం మధ్యాహ్నం జామియా విశ్వవిద్యాలయం వద్ద ఓ దుండగుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. మిగిలిన వారు అతడిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ విద్యార్థికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

వైద్య ఖర్చులు తామే భరిస్తామని విశ్వవిద్యాలయం ఉపకులపతి నజ్మా అక్తర్ తెలిపారు.

ఇదీ చదవండి:'జైలుకు వెళ్లకపోతే.. రాజకీయ నాయకుడివి ఎలా అవుతావు'

Last Updated : Feb 28, 2020, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details