దిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అనేక మంది కేంద్ర మంత్రులు, అభిమానులు హాజరయ్యారు.
లైవ్: అరుణ్ జైట్లీకి కన్నీటి వీడ్కోలు - DEATH
15:06 August 25
జైట్లీ అంత్యక్రియలు పూర్తి
14:20 August 25
అరుణ్ జైట్లీకి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా... తుది వీడ్కోలు పలికారు.
14:19 August 25
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని దిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
13:42 August 25
కన్నీటి వీడ్కోలు
అభిమానులు, నేతలు... జైట్లీకి కన్నీటీ వీడ్కోలు పలుకుతున్నారు. ప్రస్తుతం భాజపా ప్రధాన కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘాట్‌కు జైట్లీ పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. ఆ దృశ్యాలు...
13:10 August 25
అంతిమ యాత్ర...
అరుణ్ జైట్లీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. భాజపా ప్రధాన కార్యాలయం నుంచి జైట్లీ పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. నిగంబోధ్ ఘాట్‌లో కేంద్ర మాజీ మంత్రి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
12:24 August 25
రాజ్‌నాథ్ నివాళి
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థివదేహానికి నివాళులర్పించారు. దేశానికి జైట్లీ చేసిన సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా... కేంద్ర మాజీ ఆర్థికమంత్రికి పుష్పాంజలి ఘటించారు.
11:47 August 25
భాజపా కార్యాలయంలో..
భాజపా కార్యాలయానికి అగ్రనేతలు, జైట్లీ అభిమానులు తరలివెళ్తున్నారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. నేతలు, అభిమానుల సందర్శనార్ధం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పార్థివదేహం భాజపా ప్రధాన కార్యాలయంలోనే ఉండనుంది.
11:12 August 25
అమిత్ షా నివాళి
భాజపా ప్రధాన కార్యాలయంలోని జైట్లీ భౌతికకాయానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాషాయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు.
భాజపా కీలక నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66).. తీవ్ర అనారోగ్య సమస్యతో శనివారం దిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. గుండె, మూత్రపిండ సమస్యలతో ఆగస్టు 9న తీవ్ర అస్వస్థతకు గురై, దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
10:55 August 25
భాజపా కార్యాలయంలో జైట్లీ భౌతికకాయం
జైట్లీ భౌతికకాయాన్ని దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించారు. నేతలు, అభిమానుల సందర్శనార్ధం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పార్థివదేహం అక్కడే ఉండనుంది.
10:15 August 25
భాజపా కార్యాలయ మార్గంలో
అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని దిల్లీ కైలాష్‌నగర్‌లోని తన నివాసం నుంచి భాజపా ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆ దృశ్యాలు....
10:08 August 25
పూరీ తీరాన...
ఒడిశాలోని పూరీ తీరంలో ఓ అభిమాని అరుణ్ జైట్లీ సైకత శిల్పాన్ని రూపొందించి నివాళులర్పించారు.
09:43 August 25
భాజపా ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయం
అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని దిల్లీలోని తన నివాసం నుంచి భాజపా ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఆయన పార్థివదేహం అక్కడే ఉండనుంది. కార్యకర్తలు, నేతలు, అభిమానుల సందర్శనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
09:27 August 25
అనారోగ్య సమస్యతో...
భాజపా కీలక నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66).. తీవ్ర అనారోగ్య సమస్యతో శనివారం దిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు.గుండె, మూత్రపిండ సమస్యలతో ఆగస్టు 9న తీవ్ర అస్వస్థతకు గురై, దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
భాజపా ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థివదేహం ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 1.30 నిమిషాల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 1.30కు జైట్లీ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు యమునా తీరంలోని నిగంబోద్‌ఘాట్‌లో జైట్లీ అంతిమ సంస్కారాలు జరుగుతాయని భాజపా వర్గాలు వెల్లడించాయి.
09:04 August 25
కమల గళపతికి కన్నీటి నివాళి
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివదేహం ప్రస్తుతం దిల్లీలోని ఆయన స్వగృహంలో నేతులు, అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. మరికొద్ది సేపట్లో జైట్లీ భౌతికకాయాన్ని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి.