తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో 24.56 శాతంగా వైరస్ రికవరీ రేటు' - కరోనా వైరస్​ ఇండియా

భారత్​లో కరోనా బాధితుల రికవరీ రేటు 24.56 శాతానికి చేరిందని నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​ వెల్లడించారు. ఈ నెల 19 న 15శాతంగా ఉన్నట్టు గుర్తుచేశారు. అయితే రికవరీ రేటును మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు కాంత్​.

India's COVID-19 recovery rate has improved to 24.56 pc: Niti Aayog CEO
'దేశంలో 24.56శాతంగా రికవరీ రేటు'

By

Published : Apr 29, 2020, 10:35 PM IST

దేశంలో కరోనా వ్యాధి నయమయ్యే రేటు మెరుగుపడిందని తెలిపారు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్​ కాంత్. ఏప్రిల్ 19న 15 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 24.56 శాతానికి చేరుకుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ రికవరీ రేటును మరింత పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు అమితాబ్​.

"7,700 మందికి పైగా కోలుకోవడం వల్ల దేశంలో కరోనా రికవరీ రేటు మెరుగుపడిందని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఏప్రిల్​ 19న 15శాతంగా ఉన్న రికవరీ రేటు.. 26 నాటికి 19.2శాతంగా, ఈరోజు 24.56 శాతానికి చేరుకుంది. కేసులు ఎక్కువ నమోదవుతున్న రాష్ట్రాలు, జిల్లాలపై దృష్టిసారించి రికవరీ రేటును మరింత పెంచాలి."

-- అమితాబ్​ కాంత్​, నీతి ఆయోగ్​ సీఈఓ

దేశంలో ఇప్పటివరకు 31వేల 787మంది వైరస్​ బారినపడ్డారు. రికార్డు స్థాయిలో 71మరణాలు నమోదవడం వల్ల మరణాల సంఖ్య 1,008కు చేరింది. 22వేల 982 యాక్టివ్​ కేసులున్నాయి.

ఇదీ చూడండి:-'లాక్​డౌన్ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ!'

ABOUT THE AUTHOR

...view details