తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాకిస్థాన్​కు భారత సైన్యాధిపతి హెచ్చరిక - terrorim latest news

భారత సైన్యాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పాకిస్థాన్​కు హెచ్చరికలు జారీ చేశారు మనోజ్ ముకుంద్ నరవాణే. సరిహద్దులో పాక్ ఎలాంటి చర్యలకు పాల్పడినా దీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

indian-army-chief
పాకిస్థాన్​కు భారత సైన్యాధిపతి హెచ్చరిక

By

Published : Dec 31, 2019, 7:37 PM IST

ఉగ్రభూతం ఎంత ప్రమాదకరమో ప్రపంచ దేశాలు ఇప్పడిప్పుడే తెలుసుకుంటున్నాయన్నారు భారత నూతన సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణే. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్​ తన వక్రబుద్ధిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సరిహద్దు ద్వారా దేశంలోకి చొరబడేందుకు పాక్​ ఉగ్రమూకలు ప్రయత్నిస్తూనే ఉన్నాయని.. వారిని ఎదుర్కొనేందుకు సైన్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్నారు నరవాణే.

మీడితో మాట్లాడుతున్న భారత సైన్యాధిపతి

" ఉగ్రవాద ప్రభావం భారత్​పై చాలా ఏళ్లుగా ఉంది. తీవ్రవాదం కారణంగా ఉన్న ముప్పును ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి. ఉగ్రవాదాన్ని పొరుగు దేశం ఓ ఆయుధంలా వినియోగిస్తోంది. యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉండదు. ఎల్లవేళలా అందరినీ తప్పుదోవ పట్టించలేరు. ఇలాగే ముందుకు సాగాలని వారు ప్రయత్నించవచ్చు కానీ విజయం సాధించలేరు. నియంత్రణ రేఖ పరిస్థితులు ఎప్పటిలానే ఉన్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. సరిహద్దులో అక్రమ చొరబాట్ల కోసం అనేక ఉగ్రస్థావరాల్లో తీవ్రవాదులు ఎదురు చూస్తున్నారనే విషయంపై అవగాహన ఉంది. ఈ సమస్యను ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉన్నాం."

-మనోజ్​ ముకుంద్​ నరవాణే, సైన్యాధిపతి

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడ్డాయన్నారు నరవాణే. యుద్ధ వాతావరణాన్ని సృష్టించాలని పాక్ ఆర్మీ పన్నిన కుట్రలను భారత్ భగ్నం చేసిందని తెలిపారు.

చైనాతో 3,500 కి.మీ మేర ఉన్న సరిహద్దు వివాదంపై స్పందించారు నరవాణే. పశ్చిమ సరిహద్దు నుంచి దృష్టిని ఉత్తర సరిహద్దుకు మళ్లించినట్లు చెప్పారు.

నూతనంగా ఏర్పాటైన సీడీఎస్​తో భద్రతా పరంగా గొప్ప మార్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు నరవాణే. సైనిక వ్యవస్థలో కీలక సంస్కరణలు వస్తాయన్నారు.

ఇదీ చూడండి: ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్​ఫోన్స్​, డేటా కేబుల్స్​ ఫ్రీ

ABOUT THE AUTHOR

...view details