మొట్టమొదటి దేశీయ యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలేశ్వర్‌లో సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి దీన్ని పరీక్షించారు.
గగనతలం నుంచి భూఉపరితలానికి ప్రయోగించే రుద్రం క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసింది. శత్రు దేశాల నిఘా రాడార్లు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయగల ఈ క్షిపణిని ఎత్తైన ప్రాంతాల నుంచి ప్రయోగించవచ్చు. భారత వాయుసేన వద్ద ఉన్న పోరాట విమానాలు.. మిరాజ్, జాగ్వార్, తేజస్ వంటి వాటిపై నుంచి రుద్రంను ప్రయోగించవచ్చని అధికారులు తెలిపారు.