తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మే 18 నుంచి సరికొత్తగా లాక్‌డౌన్ 4.0

Narendra Modi Live News: prime minister will announce lockdown 4.0 at 8 pm on may 12th?
కరోనాపై మోదీ ప్రసంగం.. లాక్​డౌన్​పై కీలక నిర్ణయం

By

Published : May 12, 2020, 8:00 PM IST

Updated : May 12, 2020, 9:11 PM IST

20:40 May 12

జీవన్మరణ పోరాటంలో ప్రపంచానికి భారత్‌ ఔషధాలు కొత్త ఆశను కలిగించాయి: ప్రధాని

  • స్థానిక మార్కెట్లు, స్థానిక పంపిణీ వ్యవస్థల బలోపేతం: ప్రధాని
  • మనం తీసుకున్న చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి: ప్రధాని
  • ఈ విషయంలో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలి: ప్రధాని
  • మన ఆర్థిక వ్యవస్థ లోకల్‌ నుంచి గ్లోబల్‌కు ఎదిగింది: ప్రధాని
  • స్థానిక బ్రాండ్లకు మరింత ప్రోత్సాహం ఇస్తాం: ప్రధాని

20:38 May 12

మే 18 నుంచి నాలుగో దశ లాక్‌డౌన్‌కు కొత్త రూపురేఖలు: ప్రధాని

  • కరోనాపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం: ప్రధాని
  • ఈ బాధ్యతను 130 కోట్ల మంది భారతీయులం తలకెత్తుకుందాం: ప్రధాని
  • లాక్‌డౌన్‌-4లో కూడా అన్ని జాగ్రత్తలు, నియమాలు పాటిద్దాం: ప్రధాని
  • కరోనాతో పోరాడుతూనే ముందడుగు వేయాలి: ప్రధాని
  • 21వ శతాబ్దం మనదే.. ఆత్మ నిర్భర భారతదేశమే మన లక్ష్యం: ప్రధాని
  • 21వ శతాబ్దం భారత్‌దేనని గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం: ప్రధాని
  • మన సంకల్పం ఈ సంక్షోభం కన్నా గొప్పది: ప్రధాని మోదీ

20:36 May 12

స్థానిక వస్తువులకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రధాని మోదీ

  • ఈ కష్టకాలంలో చిన్న వ్యాపారులు, ఇళ్లల్లో పనిచేసేవారు, శ్రామికులు ఇబ్బందులు పడ్డారు
  • సంఘటిత, అసంఘటిత రంగంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక ప్యాకేజీ కాపాడుతుంది
  • స్థానిక మార్కెట్లను విస్తరించాల్సిన అవసరాన్ని ఈ సంకట స్థితి తెచ్చింది
  • గ్లోబల్‌ డిమాండ్‌తో పాటు, స్థానిక డిమాండ్‌ను సృష్టించాలి
  • మనం స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గ్లోబల్‌ డిమాండ్‌ సృష్టించాలి
  • మన వస్తువులను మనమే కొనుగోలు చేస్తే కొత్త ఉపాధి లభిస్తుంది
  • ఖాదీ కొనండి, స్థానిక చేనేత కారులకు ఉపాధి లభిస్తుంది: ప్రధాని
  • మాస్కులు కట్టుకుందాం, ఆరడుగుల దూరం పాటిద్దాం: ప్రధాని
  • పనిని ఆపకుండానే కరోనాను ఎదుర్కోందాం: ప్రధాని
  • నాలుగో దశ లాక్‌డౌన్‌కు కొత్త రూపురేఖలు ఇద్దాం
  • కరోనాపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం
  • ఈ బాధ్యతను 130 కోట్ల మంది భారతీయులం తలకెత్తుకుందాం
  • నవీన సంకల్పం, కొత్త ప్రాణశక్తితో అడుగు ముందుకు వేద్దాం
  • కొత్త నైపుణ్యాలు, కొత్త ఆలోచనలతో భారత్‌ను ముందుకు తీసుకెళ్దాం

20:33 May 12

సంస్కరణల పథం

భూమి, కార్మిక చట్టాలు, ద్రవ్య లభ్యత, చట్టాలు... ఇలా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని రూపొందించినట్లు వివరించారు మోదీ. పేదలు మొదలు పరిశ్రమల వరకు.. ప్రతి వర్గానికి అండగా నిలిచేలా ఈ ప్యాకేజీ ఉంటుందని తెలిపారు.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సాహసోపేత సంస్కరణలతో ముందుకు సాగడం అనివార్యమన్నారు మోదీ. గత ఆరేళ్లలో చేపట్టిన సంస్కరణల కారణంగానే ఈ సంక్లిష్ట సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ సుదృఢంగా ఉందని చెప్పారు.

20:31 May 12

మేకిన్ ఇండియా కల సాకారం చేయటానికి ఈ ప్యాకేజీ దోహదం: ప్రధాని

  • జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్ (జామ్‌) సూత్రం ఎంతో ఉపయోగపడింది: ప్రధాని
  • ప్రపంచ పంపిణీ వ్యవస్థలో భారత్‌ది కీలకపాత్ర కానుంది: ప్రధాని

20:29 May 12

కరోనా సంక్షోభంతో నిలిచిన ప్రగతి రథాన్ని తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో చారిత్రక అడుగు వేసింది మోదీ సర్కార్. ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ పేరిట ఏకంగా రూ.20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.  

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆర్థిక ప్యాకేజీ వివరాల్ని స్థూలంగా వెల్లడించారు. కరోనాపై పోరు కోసం ఇప్పటికే ప్రకటించిన గ్రాంట్లు, ఆర్​బీఐ నిర్ణయాలు, ఇతర ఉద్దీపనలన్నీ కలుపుకుని ప్యాకేజీ విలువ రూ.20లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఇది భారత జీడీపీలో 10శాతమని తెలిపారు. ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి రంగాలవారీగా ప్రకటిస్తారని చెప్పారు మోదీ.

20:26 May 12

ఆత్మ నిర్భర్‌ అభియాన్​తో కొత్త విప్లవానికి నాంది పలుకబోతున్నాం: మోదీ

  • కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు అనేక అవకాశాలు: మోదీ
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం
  • దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుకుపుకొని పోయేలా ప్యాకేజీ
  • భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగకరం
  • రేపు ఆత్మ నిర్భర్‌ అభియాన్‌పై ఆర్థికమంత్రి వివరాలు అందిస్తారు
  • భారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది
  • జన్‌ధన్‌ అభియాన్‌తో మనం ఒక విప్లవాన్ని చూశాం
  • భవిష్యత్తులో వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏర్పాట్లు ఉంటాయి
  • బలమైన ఆర్థికవ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుంది
  • బలమైన ఆర్థికవ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుంది
  • మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఈ ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుంది
  • ప్రపంచ తయారీ రంగానికి భారత్‌ కొత్త వేదికగా నిలుస్తుంది
  • మన సామర్థ్యం, నాణ్యత అన్నింట్లోనూ నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుంది

20:23 May 12

సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడం కోసమే ప్యాకేజీ: ప్రధాని

  • మన వద్ద సాధన, సంపత్తి, అద్భుత మానవ వనరులు ఉన్నాయి: ప్రధాని
  • మన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుందాం: ప్రధాని
  • గతంలో అనేక ఉత్పాతాలను మనం అధిగమించి ముందుకు సాగాం: ప్రధాని
  • దేశంలో రోజూ 2 లక్షల ఎన్‌-95 మాస్కులు ఉత్పత్తి జరుగుతోంది: ప్రధాని
  • ప్రపంచం సంక్షోభంలో ఉంది.. మనం మరింత నిబ్బరంగా ఉండాలి: ప్రధాని
  • ఆత్మనిర్బర్‌ భారత్‌ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి: ప్రధాని

20:21 May 12

ఆత్మ నిర్భర్‌ భారత్ అభియాన్‌ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ

  • రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ: ప్రధాని
  • మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతం: ప్రధాని

20:18 May 12

వస్తూత్పత్తిలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది: ప్రధాని మోదీ

  • నాణ్యతపైన, సప్లయ్‌చైన్ పైనా మనం మరింత దృష్టి పెట్టాల్సి ఉంది: మోదీ
  • కచ్​‌ భూకంపాన్ని నా కళ్లతో చూశాను: మోదీ
  • భూకంపం తర్వాత కచ్‌ నిలబడలేదు అనున్నారు: మోదీ
  • ఇవాళ కచ్‌ తలెత్తుకుని నిలబడి, పారిశ్రామిక కేంద్రంగా ఎదిగింది: మోదీ

20:15 May 12

సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో భారత్‌ కృషి ప్రపంచానికి చుక్కాని లాంటిది: మోదీ

  • పర్యావరణానికి భారత్‌ అమూల్యమైన కృషి చేస్తోంది.
  • భారత్‌ కొత్త దారి చూపించగలదనే నమ్మకం ప్రపంచానికి కలిగించింది.
  • ప్రపంచానికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపడంలో భారత్‌ ముందుంటుంది.
  • వైటూకే సమస్య వచ్చినప్పుడు ప్రపంచానికి సాంకేతిక సహకారం అందించింది భారత్‌ మాత్రమే.

20:13 May 12

పీపీఈ కిట్లు, మాస్కుల తయారీలో స్వయం సమృద్ధి సాధించాం: ప్రధాని  

  • మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ కకావికలం చేసింది: ప్రధాని మోదీ
  • మనల్ని రక్షించుకునేందుకు ప్రపంచమంతా కలిసి పనిచేయాలి: ప్రధాని
  • మనం స్వతంత్రంగా ఎదగడమే ఏకైక మార్గం: ప్రధాని మోదీ
  • కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం: ప్రధాని
  • మనవద్ద తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం: ప్రధాని
  • వసుధైక కుటుంబం అనే భావన మనల్ని ముందుకు నడిపిస్తోంది: ప్రధాని
  • విశ్వమానవ కల్యాణానికి మనవంతు సహకారం అందిస్తున్నాం: ప్రధాని
  • భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచానికి కొత్త దారి చూపిస్తుంది: ప్రధాని

20:10 May 12

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. వినలేదు: ప్రధాని మోదీ

  • మన పోరాట సంకల్పాన్ని మరింతగా బలపరుచుకోవాలి: ప్రధాని
  • ఈ ఆపద మనకు ఒక సంకేతం.. సందేశాన్ని ఇచ్చింది: ప్రధాని
  • కరోనాకు ముందు ఒక్క పీపీఈ కిట్‌ కూడా మనం తయారు చేయలేదు: ప్రధాని
  • కరోనాకు ముందు ఎన్‌-95 మాస్కులు నామమాత్రంగా తయారు చేసేవాళ్లం: ప్రధాని
  • ఈ ఆపద మనల్ని అవసరం వైపు నడిపించింది: ప్రధాని మోదీ
  • ఇంత పెద్ద ఆపద భారత్‌కు ఒక సందేశాన్ని, ఒక అవసరాన్ని తీసుకువచ్చింది: ప్రధాని

20:09 May 12

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ వేదికపై ప్రజల పోరాట సంకల్పాన్ని ఆయన మెచ్చుకున్నారు.

  • ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోంది: మోదీ
  • ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదు: ప్రధాని మోదీ
  • కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి: ప్రధాని
  • కరోనాకు ముందు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి: ప్రధాని మోదీ
  • ప్రపంచవ్యాప్తంగా నేటి పరిస్థితి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది: ప్రధాని
  • నాలుగు నెలలకు పైగా సమయం గడిచిపోయింది: ప్రధాని మోదీ
  • భారత్‌లో కూడా అనేక మంది అయినవారిని కోల్పోయారు: ప్రధాని
  • ఒకే ఒక్క వైరస్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసింది: ప్రధాని మోదీ

20:04 May 12

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై మోదీ కీలక ప్రకటన చేయనున్నారు.

19:48 May 12

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్​ విజృంభణ, ఈ నెల 17తో లాక్​డౌన్​ ముగియనున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ద్విముఖ వ్యూహంపై ప్రకటన!

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ పొడిగింపు అనివార్యం అని తెలుస్తోంది. ఇదే విషయంపై సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో లాక్​డౌన్​ పొడిగించాలంటూ పలువురు ముఖ్యమంత్రులు మోదీని అభ్యర్థించారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. 

ప్రజల ప్రాణాలను కాపాడుతూనే, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు మోదీ. అందుకు అనుగుణంగా చేపట్టనున్న చర్యల్ని మోదీ వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దశల వారీగా అనేక ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులిస్తోంది ప్రభుత్వం.

వలస కూలీల కష్టాలపై...

వలస కూలీల వ్యవహారంపై ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. పలువురు కూలీలు రైలు ప్రమాదంలో మృతి చెందడం, మరికొంత మంది స్వస్థలాలకు నడిచి వెళుతూ మరణించడంపై ప్రధాని ప్రస్తావిస్తారని సమాచారం. 

వలస కూలీలను తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. మరికొన్ని రాష్ట్రాలు వచ్చిన వారి విషయంలో అలసత్వం ప్రదర్శించడంపై ప్రధాని అసంతృప్తి గా ఉన్నట్లు సమాచారం. దీనితోపాటు పలు చోట్ల లాక్​డౌన్​ నిబంధనలు అమలులో ప్రజలు ఇష్టా రీతిలో వ్యవహరించడం పై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది.

Last Updated : May 12, 2020, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details