కరోనా మహమ్మారి యావత్ మానవాళికి పెను సవాలుగా మారిన పరిస్థితుల్లోనూ... నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగడంపై తీవ్రంగా స్పందించారు భారత సైన్యాధిపతి జనరల్ మేజర్ ముకుంద్ నరవాణే. కరోనా రక్కసిపై పోరులో ప్రపంచానికి కావాల్సిన మందులను సరఫరా చేయడంలో భారత్ నిమగ్నమైతే పాక్ మాత్రం తీవ్రవాదాన్ని ఎగదోస్తుందన్నారు. ఇది సరైన విధానం కాదని పొరుగు దేశానికి హితవు పలికారు.
'ఔషధాల ఎగుమతితో భారత్ బిజీ- ఉగ్రవాదంతో పాక్'
కరోనా వైరస్‌పై ప్రపంచమంతా ఐక్య పోరాటం సాగిస్తుంటే... పాకిస్థాన్ మాత్రం తీవ్రవాదాన్ని ఎగదోస్తుందని మండిపడ్డారు భారత సైన్యాధిపతి జనరల్ మేజర్ ముకుంద్ నరవాణే. ఇలాంటి సమయంలోనూ పాక్ తీరు మారకపోవడం దురదృష్టమన్నారు.
'ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే పాక్ మాత్రం..'
"ఇది చాలా దురదృష్టకరం. ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తుంటే... ఈ సమయంలోనూ పాక్ మనల్ని ఇబ్బంది పెడుతోంది." - మేజర్ జనరల్ ముకుంద్ నరవాణే, భారత సైన్యాధిపతి
భారత సైన్యంలో ఇప్పటివరకు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు నరవాణే తెలిపారు. ఇందులో ఇద్దరు వైద్యులు, ఒక నర్సు, మరో నలుగురు చికిత్సకు పూర్తిగా స్పందిస్తున్నారన్నారు. మరొకరు పూర్తిగా కోలుకొని విధుల్లో తిరిగి చేరినట్లు స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి:లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్