దేశంలో గడచిన 24 గంటల్లో 3,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
కరోనా కేసుల్లో భారత్... చైనాను దాటిపోయింది. ప్రపంచదేశాలతో పోల్చుకుంటే... 85,970 పాజిటివ్ కేసులతో భారత్ 11వ స్థానంలో ఉండగా.. 82,941 కేసులతో చైనా 13వ స్థానంలో ఉంది. కరోనా మరణాల విషయానికి వస్తే భారత్లో 2,753 మంది మహమ్మారి బారినపడి మరణిస్తే... చైనాలో 4,633 మంది మృతి చెందారు.