తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాకిస్థాన్​ జాతీయ దినోత్సవాన్ని బహిష్కరించిన భారత్​

దిల్లీలో శనివారం నిర్వహించే పాకిస్థాన్​ జాతీయ దినోత్సవాన్ని బహిష్కరించాలని భారత ప్రభుత్వం​ నిర్ణయించింది. కశ్మీర్​ వేర్పాటువాదులను ఈ కార్యక్రమానికి పాక్ ఆహ్వానించటమే ఇందుకు కారణం.

By

Published : Mar 22, 2019, 5:00 PM IST

పాకిస్థాన్​ జాతీయ దినోత్సవ వేడుకలకు భారత్​ దూరం

పాకిస్థాన్​ జాతీయ దినోత్సవ వేడుకలకు భారత్​ దూరం
దిల్లీలోని పాకిస్థాన్​ రాయబారి​ కార్యాలయంలో శనివారం పాక్​ జాతీయ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు​ దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

వేడుకలకు కశ్మీర్​ వేర్పాటువాద సంస్థ హురియత్​ నాయకులను​ ఆహ్వానించింది పాక్​. దీనితో పాటు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్​ వేడుకలకు దూరంగా ఉండాలని భారత్​ నిర్ణయం తీసుకుంది.

కొన్నేళ్లుగా కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కానీ ఈ ఏడాది భారత్ తరఫున ఏ ఒక్కరిని పంపకూడదని నిశ్చయించింది భారత్​.

ఇదీ చూడండీ: పారదర్శకంగా సంఝౌతా కేసు విచారణ: భారత్‌

ABOUT THE AUTHOR

...view details