బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా ఉన్న హాట్స్పాట్(రెడ్ జోన్లు) జిల్లాల సంఖ్య 129కి పడిపోయింది. రెండు వారాల క్రితం ఆ సంఖ్య 170గా ఉంది. అదే సమయంలో గ్రీన్ జోన్లు 325 నుంచి 307కు తగ్గాయి. అయితే ఈ రెండు వారాల వ్యవధిలో ఆరెంజ్ జోన్లు 207నుంచి 297కు చేరాయి.
కరోనా వైరస్ వ్యాప్తి రేటు అధికంగా ఉన్నా లేక కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నా ఆ ప్రాంతాలను రెడ్ జోన్లుగా పరిగణిస్తారు. కొంతమేర తక్కువగా కేసులుంటే ఆరెంజ్ జోన్ అని.. అసలు కరోనా కేసులే లేని జిల్లాలను గ్రీన్జోన్లుగా పిలుస్తారు.
రెడ్ జోన్లలో 28, ఆరెంజ్ జోన్లలో 14 రోజులపాటు ఎలాంటి కేసులు నమోదుకాకపోతే.. ఆ ప్రాంతాలను గ్రీన్జోన్ల జాబితాలో చేరుస్తారు.
ఏప్రిల్ 15న.. దేశవ్యాప్తంగా ఉన్న 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 170 జిల్లాలను హాట్స్పాట్లుగా ప్రకటించింది ప్రభుత్వం.