పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో పౌర జ్వాలలు చల్లారడం లేదు. ఈరోజు వందలాది మంది నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. నిషేధాజ్ఞలు విధించిన ప్రదేశాల్లో నిరసనలు చేపట్టిన వందలాది మంది నిరసనకారులను నిర్బంధించారు.
జామా మసీదు వద్ద ఆందోళనలు
దిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం వందలాది మంది నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దేశానికి కావాల్సింది ఎన్ఆర్సీ కాదని, ఉద్యోగాలు కావాలని గళమెత్తారు. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్ నాయకులు అల్కా లాంబ, శోయబ్ ఇక్బాల్ పాల్గొన్నారు. దేశంలో నిరుద్యోగమే నిజమైన సమస్య అని.. ఎన్ఆర్సీ కోసం ప్రజలను క్యూలో నిల్చునేలా చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు లాంబ. నోట్ల రద్దు సమయంలోనూ ఇలానే జరిగిందని గుర్తు చేశారు. దేశం కోసం రాజ్యంగ గళాన్ని వినిపించాల్సిన అవసరముందన్నారు లాంబ.
ప్రధాని ఇంటికి మార్చ్..