తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మధ్యాహ్న భోజన పథకంలో అల్పాహారం చేర్చబోం'

మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు బదులుగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్రమంత్రి రమేశ్​ పొఖ్రియాల్.

'మధ్యాహ్న భోజన పథకంలో అల్పాహారం చేర్చబోం'

By

Published : Jun 27, 2019, 7:34 PM IST

Updated : Jun 27, 2019, 7:58 PM IST

మధ్యాహ్న భోజన పథకంలో అల్పాహారం చేర్చబోమని తెలిపిన కేంద్రం

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతమున్న మధ్యాహ్న భోజన పథకానికి అదనంగా అల్పహారాన్ని కూడా చేర్చే ఆలోచన లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్​ తెలిపారు. రాజ్యసభలో ఓ లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

జాతీయ ఆహార భద్రత చట్టం-2013 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 1నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల(6-18 ఏళ్ల వయసు)కు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఉచితంగా ఒక్కపూట భోజన సదుపాయం కల్పిస్తున్నారు. పిల్లలకు పోషకాహారం అందజేసేందుకే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు పొఖ్రియాల్​ తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వం సొంత ఖర్చుతో పాఠశాల విద్యార్థులకు పాలు, గుడ్లు, పండ్లు అదనంగా సమకూరుస్తున్నారని చెప్పారు.

2018-19 సంవత్సరానికి మధ్యాహ్న భోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11.34 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 9.17కోట్ల మంది విద్యార్థులకు ఒక్క పూట భోజనాన్ని అందించారు.

ఇదీ చూడండి: వైద్య విద్యార్థినిపై యువకుని కత్తి దాడి

Last Updated : Jun 27, 2019, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details