శీతాకాల విడిది కోసం విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా బెంగళూరు వైపే చూస్తారు. అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఈ సారి శీతాకాలం పూర్తవకముందే చలిగాలులు పారిపోయి వడగాలులు తీవ్రమయ్యాయి. బెంగళూరులో జనవరి 30న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 150 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా 33.4 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
శీతాకాల విడిదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు - శీతకాల విడిదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
గత 150 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జనవరిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు బెంగళూరులో నమోదయ్యాయి. గత నెల 30న 33.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతవారణ శాఖ ప్రకటించింది.
శీతకాల విడిదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ విమానాశ్రయం వద్ద 32.5 డిగ్రీలు నమోదుకాగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాత రికార్డు 2000 జనవరి 21న నమోదైన 32.8 డిగ్రీల ఉష్ణోగ్రతను చెరిపివేసింది.
ఇదీ చూడండి : బడ్జెట్ 2020: నిర్మల పద్దులోని హైలైట్స్
Last Updated : Feb 28, 2020, 8:07 PM IST
TAGGED:
IMD