ETV Bharat / business

బడ్జెట్​ 2020: నిర్మల పద్దులోని హైలైట్స్​ - Impact of Budget 2020

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. నేడు పార్లమెంట్​లో 2020-21 వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ, మౌలిక వసతుల రంగానికి పెద్ద పీట వేస్తూ వృద్ధికి ఊతమిచ్చే ప్రయత్నం చేశారు. వేతనజీవులకు ఊరట కలిగించేలా పన్నుల విధానంలో కీలక మార్పులు చేశారు. బడ్జెట్​లోని మరిన్ని ముఖ్యాంశాలు మీకోసం....

KEY HIGHLIGHTS OF UNION BUDGET 2020-21
కేంద్ర బడ్జెట్​ 2020 ముఖ్యాంశాలు
author img

By

Published : Feb 1, 2020, 5:34 PM IST

Updated : Feb 28, 2020, 7:14 PM IST

కేంద్ర వార్షిక బడ్జెట్​ 2020-21ని నేడు పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు ప్రతిపాదిస్తూనే సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా.. రైతులు సహా మధ్య తరగతి ప్రజల అభివృద్ధికి ఈ బడ్జెట్​ భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు నిర్మలా.

"దేశ ప్రజలు సరైన ఉపాధిని పొందుతారు. మన వ్యాపారాలు సుభిక్షంగా ఉంటాయి. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలు, ప్రజలక ఆశలను తీర్చే విధంగా ఈ బడ్జెట్​ భరోసా కల్పిస్తోంది" అని అన్నారు మంత్రి.

బడ్జెట్​లోని కీలకాంశాలు:

ఆదాయ పన్ను నూతన స్లాబ్​లు

  • 5 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు.
  • 5-7.5 లక్షల వరకు 10 శాతం చెల్లించాలి.
  • 7.6-10 లక్షల వరకు 15 శాతం
  • 10-12.5 లక్షల వరకు 20 శాతం (గతంలో ఇది 30 శాతం)
  • 15 లక్షలకుపైగా ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను
  • ఒక వ్యక్తి ఏడాదికి రూ.15 లక్షల ఆదాయం పొందితే.. రూ.1.95 లక్షల పన్ను చెల్లించాలి.
  • నూతన వ్యక్తిగత ఆదాయ పన్నుల విధానం ద్వారా ఏడాదికి సుమారు రూ.40 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు..

⦁ నూతన పారిశ్రామిక ఔత్సాహికులకు అనుమతుల్లో ఎండ్​ టు ఎండ్​ సదుపాయం, ప్రోత్సాహకాలు అందించటం.
⦁ రాష్ట్రాల భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో 5 కొత్త స్మార్ట్​ నగరాల అభివృద్ధి
⦁ మొబైల్​ ఫోన్లు, ఎలక్ట్రానిక్​ వస్తువులు, సెమికండక్టర్​ ప్యాకేజింగ్​ తయారీ రంగాన్ని ప్రోత్సహించటం
⦁ భారత్​ను అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలిపేందుకు జాతీయ సాంకేతిక జౌళి మిషన్​

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)

  • నూతన పన్ను విధానం రవాణా రంగంలో లాభాలు అర్జించేందుకు ఉపయోగపడింది.
  • జీఎస్టీ ద్వారా వినియోగదారులు ప్రతి ఏటా సుమారు రూ. 1 లక్షల కోట్లు లబ్ధి పొందారు.

రైతులు..

⦁ 2020-21 ఏడాదికి గాను ప్రభుత్వం.. రైతులకు రూ. 15 లక్షల కోట్లు అందించనుంది.
⦁ నాబార్డ్​ ద్వారా అందించే రుణాల పథకాన్ని కొనసాగించనున్నారు.

వ్యవసాయ రంగ అభివృద్ధికి 16 సూత్రాలు

  • ఈ 16 సూత్రాల ద్వారా విధాన పరమైన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చేందుకు రాష్ట్రాలను ప్రోత్సహించటం. 100 నీటి ఎద్దడి గల జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక. పీఎం కుసుమ్​ పథకం ద్వారా కిరోసిన్​ పై ఆధారపడే కుటుంబాలు సౌర శక్తి వినియోగించేలా ప్రోత్సహించటం. రసాయన ఎరువులను సమతూకంగా వాడటం వంటివి ఉన్నాయి.
  • మహిళా స్వశక్తి గ్రూపులు నిర్వహించేలా గ్రామీణ స్టోరేజ్​ పథకం. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువగా నిలువ చేసుకుని రవాణా నష్టాలను తగ్గించుకోవచ్చు.
  • ఈ స్టోరేజీ వ్యవస్థను గ్రామీణ మహిళలు నిర్వహించేలా చర్యలు
  • విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్రిషి ఉడాన్​ పథకం ప్రారంభం
  • ఉద్యానవన ఉత్పత్తులు.. ఆహార ఉత్పత్తుల కన్నా ఎక్కువకు పెంచాలని లక్ష్యం
  • 2025 నాటికి గొర్రెలు, మేకల్లో వచ్చే మూతి, కాళ్ల పుండ్ల వ్యాధులను నివారించాలని ధ్యేయం
  • 2025 నాటికి పాల ఉత్పత్తిని రెండింతలు చేయాలని లక్ష్యం.
  • వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్ల కేటాయింపు
  • గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్​ అభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్ల కేటాయింపు

పరిశ్రమ, వాణిజ్య రంగం

⦁ 2020-21 ఆర్థిక ఏడాదికి గాను పరిశ్రమ, వాణిజ్య రంగ అభివృద్ధికి రూ.27,300 కేటాయింపు.
⦁ ప్రతి జిల్లాలను ఎగుమతుల హబ్​గా మార్చటం
⦁ క్వాంటమ్​ టెక్నోలజీ, అప్లికేషన్స్​కి ఐదేళ్లకు గాను రూ.8 వేల కోట్ల కేటాయింపు.
⦁ 2023 నాటికి దిల్లీ-ముంబయి ఎక్స్​ప్రేస్​ వే, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయటం
⦁ 2024 నాటికి 6 వేల కిలోమీటర్ల మేర 12 రకాల హైవేల నిర్మాణాలు పూర్తి చేయటం

డిపాజిట్​ ఇన్సూరెన్స్​ పథకం

  • బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు.

పర్యటక రంగం

  1. పర్యటక రంగం ద్వారా 2020-21లో సుమారు రూ.2,500 కోట్లు ఆదాయం అంచనా
  2. సాంస్కృతిక శాఖకు రూ.3,150 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదన
  3. ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెరిటేజ్​ అండ్​ కన్సర్వేషన్​ ఏర్పాటు
  4. 8 కొత్త మ్యూజియాలు, 5 పాత మ్యూజియాల మరమ్మతు
  5. 5 ప్రముఖ పర్యటక ప్రదేశాలల్లో మౌళిక వసతుల కల్పన

మౌలిక సదుపాయాల రంగం

⦁ ఉడాన్​ పథకానికి ప్రోత్సాహకంగా 2024 నాటికి మరో 100 విమానాశ్రయాల అభివృద్ధి
⦁ విద్యుత్తు, పునరుత్పాదక శక్తి రంగానికి రూ. 22,000 కోట్ల కేటాయింపు
⦁ జాతీయ గ్యాస్​ గ్రిడ్​ను ప్రస్తుతం ఉన్న 16,200 కిలోమీటర్ల నుంచి 27000 కిలోమీటర్లకు పెంపు
⦁ నేషనల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ పైప్​లైన్​కు రూ.103 లక్షల కోట్ల కేటాయింపు. అందులో రూ. 22 వేల కోట్లు ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఫైనాన్స్ సంస్థ ద్వారా సమీకరణ

బ్యాంకింగ్​ రంగంలో సంస్కరణలు

  1. డిపాజిట్​ ఇన్స్యూరెన్స్​ కవరేజ్​ రూ.5 లక్షలకు పెంపు
  2. ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఎన్​పీఎస్​ ట్రస్ట్​ ఏర్పాటు
  3. ఐపీఓ ద్వారా జీవిత బీమా సంస్థ (ఎస్​ఐసీ)లోని ప్రభుత్వ వాటాలో కొంత అమ్మేందుకు ప్రతిపాదన
  4. ఇన్​వాయిస్​ ఫైనాన్షింగ్​, ఎగుమతుల ప్రోత్సాహక పథకం
  5. 2021, మార్చి 31 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల పునర్వవస్థీకరణకు ఆర్​బీఐ అవకాశం కల్పించటం
  6. కార్పొరేట్​ బాండ్లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 9 నుంచి 15 శాతానికి పెంపు

వైద్య రంగం

⦁ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య సంరక్షణకు రూ.69, 000 కోట్ల కేటాయింపు
⦁ ప్రధానమంత్రి జన్​ ఆరోగ్య యోజన పథకంలో భాగంగా పీపీపీ పద్ధతిలో ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రత్యేక విభాగానికి ప్రతిపాదన
⦁ 2024 నాటికి జన్​ ఔషధి కేంద్ర పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని లక్ష్యం

Last Updated : Feb 28, 2020, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.