తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన షా

కేంద్ర హోంమంత్రి అమిత్​షా జేఎన్​యూలో ఉద్రిక్త పరిస్థితులపై దిల్లీ పోలీస్​ కమిషనర్​ అమూల్యా పట్నాయక్​ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీనియర్​ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.

HM speaks to Delhi CP on JNU
అమిత్​ షా: జేఎన్​యూ ఘటనపై సీనియర్ అధికారితో విచారణ

By

Published : Jan 5, 2020, 11:50 PM IST

జేఎన్​యూలో విద్యార్ధులపై జరిగిన దాడి గురించి దిల్లీ పోలీస్​ కమిషనర్ అమూల్యా పట్నాయక్​ను అడిగి తెలుసుకున్నారు​ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కోసం జాయింట్​ సీపీ స్థాయి అధికారిని నియమించినట్లు అధికారులు తెలిపారు.

షా ట్విట్​

"జేఎన్​యూ హింసకు సంబంధించిన వివరాలను దిల్లీ పోలీస్​ కమిషనర్​ను.. కేంద్ర హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చర్యపై జాయింట్​ కమిషనర్ ఆఫ్​ పోలీస్​ స్థాయి అధికారితో విచారణ జరిపించి ఆ నివేదికను త్వరగా సమర్పించాలని కోరారు."
-హోంమంత్రిత్వ శాఖ ట్వీట్​.

జేఎన్​యూలో శాంతి భద్రతలను పునరుద్ధరించటానికి తీసుకోవలసిన చర్యలపై దిల్లీ పోలీసుల నుంచి నివేదికలను కోరింది హోం మంత్రిత్వ శాఖ.

ఏం జరిగింది?

జేఎన్​యూలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు.. ముఖాలకు మాస్కులు ధరించి.. విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుమారు 18 మందికి గాయలయ్యాయి. గాయపడిన వారిని ఎయిమ్స్​కు తరలించారు.​

ఇదీ చూడండి:మరోసారి జేఎన్​యూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి

ABOUT THE AUTHOR

...view details