జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్ జరిగింది. దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది.
కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది హతం - Hizb terrorist killed in encounter in Doda
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడిని మట్టుబెట్టింది సైన్యం. మృతుడిని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కశ్మీర్లో ఎదురు కాల్పులు-ఉగ్రవాది హతం
ముష్కరులు గొన్దానా బెల్ట్ వద్ద నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టింది సైన్యం. ఈ ప్రక్రియలోనే ఉగ్రవాదిని హతమార్చింది. మృతుడిని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన అబ్బాస్‌గా గుర్తించారు అధికారులు.
ఇదీ చూడండి : ఆహా: 1995 కేజీల కిచిడీతో గిన్నిaస్ రికార్డు