తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వైరస్​తో హృద్రోగులకు అధిక ముప్పు! - కరోనా వైరస్​ న్యూస్​

కరోనా వైరస్​ బారిన పడిన హృద్రోగుల్లోనే 10 శాతం మేర అధిక మరణాలు సంభవిస్తాయని ఓ నివేదిక వెల్లడించింది. వ్యాధి బారిన పడిన ఆరోగ్యవంతులతో పోల్చితే గుండె సమస్యలు ఉన్న వారికే అధిక ముప్పు ఉందని తేల్చింది. హృద్రోగులు తగు జాగ్రత్తలు పాటించి కొవిడ్​ సోకకుండా చూసుకోవటమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

COVID-19
కరోనా వైరస్​తో హృద్రోగుల్లోనే అధిక శాతం మరణాలు!

By

Published : Apr 4, 2020, 6:40 PM IST

కరోనా వైరస్​ శ్వాసకోశ నాళాలపై అధిక ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఈ మహమ్మారి హృదయనాళ సమస్యలకూ దారితీస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్​-19 బారిన పడిన హృద్రోగులపై.. వ్యాధి సోకిన ఆరోగ్య వంతులతో పోల్చితే అధిక శాతం ప్రభావం ఉంటుందని తేల్చాయి.

కొవిడ్​-19 బాధితుల్లో కేవలం 20 శాతం మందికి తీవ్రమైన లక్షణాల కారణంగా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుంది. ఆస్పత్రిలో చేరుతున్న వారిలో చాలా మంది నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అయితే.. ఆస్పత్రిలో చేరుతున్న వారిలో 10-20 శాతం మందిలో తీవ్రమైన హృదయనాళ సమస్యలు కూడా ఉన్నట్లు ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.

ఒత్తిడి అధికం..

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కరోనా వైరస్​ బారిన పడితే.. వారికి గుండెపోటుతో పాటు కొన్ని సందర్భాల్లో గుండె కొట్టుకోవటం ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదిక తేల్చింది. ఇందుకు ప్రధాన కారణం వైరస్​తో హృదయంపై ఒత్తిడి పెరగటం.. అదే సమయంలో నిమోనియా కారణంగా ఆక్సిజన్​ స్థాయిలు పడిపోవటం జరుగుతోందని వెల్లడించింది.

కరోనాతో ఏర్పడే గుండె సమస్యలకు కారణం ఇంకా తెలియరాలేదని.. అలాంటి సమస్యలకు చికిత్స చేసే విధానంపైనా వైద్యులకు సరైన అవగాహన లేదని పేర్కొంది నివేదిక.

10 శాతం అధిక మరణాలు..

గుండె సమస్యలతో బాధపడుతున్న రోగులు కొవిడ్​-19 బారినపడితే .. వ్యాధి సోకిన ఆరోగ్యవంతులతో పోల్చితే 10 శాతం అధికంగా మరణాలు సంభవిస్తాయని వెల్లడించింది పరిశోధన. హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రస్తుతం ఎలాంటి మార్గదర్శకాలు లేవు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు పాటించటమే సరైన మార్గం. చేతులు శుభ్రంగా కడుక్కోవటం, భౌతిక దూరం పాటించటం, రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవటం వంటివి చేయటమే ఉత్తమమని నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి: 'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం

ABOUT THE AUTHOR

...view details