తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అస్థానా కేసు విచారణ గడువు పెంపు

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ డైరెక్టర్ రాకేశ్ అస్థానా అవినీతిపై కేసు విచారణ గడువు మరో నాలుగు నెలలు పెంచింది దిల్లీ హైకోర్టు. లంచం తీసుకుని ఓ కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు కుట్రపన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అస్థానా.

By

Published : May 31, 2019, 3:47 PM IST

అస్థానా కేసు విచారణ గడువు నాలుగు నెలలు పెంపు

సీబీఐ మాజీ సంచాలకుడు రాకేశ్​ అస్థానా అవినీతిపై కేసు విచారణకు మరో నాలుగు నెలలపాటు సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దిల్లీ హైకోర్టు. లంచం తీసుకుని కుట్రపూరితంగా ఓ కేసు విచారణను పక్కదోవ పట్టించారన్నది ఆయనపై అభియోగం.

కేసు విచారణకు మరింత సమయం కావాలని దిల్లీ హైకోర్టుకు సీబీఐ విన్నవించింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ ముక్తా గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అస్థానాపై నేరపూరిత కుట్ర, అవినీతి కేసులు నమోదు చేశారు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారవేత్త సంతకాన్ని మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ ఫోర్జరీ చేశారన్న కేసు.. విచారణ నిమిత్తం సీబీఐకి వచ్చింది. ఈ కేసు నుంచి ఉపశమనం కల్పించడం కోసం మొయిన్ ఖురేషి నుంచి రాకేశ్ అస్థానా లంచం పుచ్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గడువు పెంపు రెండోసారి..

అస్థానా కేసు విచారణకు జనవరి 11న సీబీఐ విచారణకు 10 వారాల గడువు విధించింది కోర్టు. గడువు ముగిసిన అనంతరం మరో 10 వారాల సమయం కోరుతూ కోర్టును ఆశ్రయించింది సీబీఐ. మరోసారి పెంచిన గడువు తాజాగా ముగిసిపోగా... మరో నాలుగు నెలల సమయం కోరుతూ కోర్టును ఆశ్రయించింది సీబీఐ.

ఇదీ చూడండి: 'స్పెల్లింగ్ ​బీ'లో మళ్లీ మనోళ్లే అదరగొట్టారు

ABOUT THE AUTHOR

...view details