కరోనా నియంత్రణకు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా ఇంట్లో తయారు చేసిన మాస్కులను వినియోగించాలని స్పష్టం చేసింది. మాస్కులు వాడటం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చని కేంద్రం తెలిపింది. దీని వల్ల ఎక్కువ మందికి వైరస్ సోకే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ మేరకు సూచనలు చేస్తోంది కేంద్రం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,902 కరోనా కేసులు నమోదు కాగా, 68మంది మృతి చెందారు.