తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీడీఎస్​కు దన్నుగా 40 మంది అధికారుల నియామకం - Chief of Defence Staff (CDS)

కేంద్ర ప్రభుత్వం.. త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ నేతృత్వంలోని కొత్త విభాగంలోకి కొంతమంది అధికారులను నియమించింది. ఇద్దరు ఉమ్మడి కార్యదర్శులు సహా మొత్తం 38 మంది అధికారులను బిపిన్​కు దన్నుగా ఏర్పాటు చేసింది.

Govt appoints 2 joint secretaries, 38 other officials to assist Chief of Defence Staff
సీడీఎస్​కు దన్నుగా కొంతమంది అధికారుల నియామకం

By

Published : Jan 10, 2020, 10:08 PM IST

Updated : Jan 10, 2020, 11:52 PM IST

త్రిదళాధిపతి బిపిన్​ రావత్ నేతృత్వంలోని సీడీఎస్​ విభాగానికి 40 మందిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విభాగంలోకి ఇద్దరు ఉమ్మడి కార్యదర్శులు, 13 మంది డిప్యూటీ కార్యదర్శులు, 25 మంది అండర్​ సెక్రటరీ ర్యాంక్​ అధికారులు రానున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీడీఎస్​కు అన్నివిధాల సహాయం చేయటం కోసం వీరిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్రివిధ దళాలను బలోపేతం చేయటానికి వీరు తోడ్పడతారన్నారు.

తొలి త్రిదళాధిపతిగా బిపిన్​ రావత్​ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడు దళాలను మరింత సమన్యయం చేయడానికి ముఖ్య అధికారులతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1న తొలి సీడీఎస్​గా ప్రమాణ స్వీకారం చేశారు రావత్.​ ఈ బాధ్యతలతో పాటు.. త్రిదళాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ రక్షణ మంత్రికి సైనిక సలహాదారుడిగానూ వ్యవహరిస్తున్నారు.

రక్షణశాఖకు కేటాయించిన బడ్జెట్​ సరైన రీతిలో వినియోగించటానికి, మూడు విభాగాలపై ఉమ్మడి ప్రణాళిక, శిక్షణ, కార్యకలాపాలను మరింత బలోపేతం చేయటానికి సీడీఎస్​ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. మూడు విభాగాలకు చెందిన ఆయుధాలు, పరికరాలను స్వదేశీకరించటానికి తీసుకోవలసిన చర్యలపై కీలక పాత్ర పోషించనున్నారు సీడీఎస్​.

ఇదీ చూడండి:కారు నుంచి రోడ్డుపై పడిన చిన్నారి..తప్పిన ప్రమాదం

Last Updated : Jan 10, 2020, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details