తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వైరస్‌పై ప్రభుత్వం ఫోన్‌ సర్వే - కరోనా వైరస్‌

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ గురించి ఫోన్​ ద్వారా సర్వే చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం 1921 అనే నంబర్​ నుంచి ఫోన్​ వస్తుందని.. ప్రతి ఒక్కరు ఈ సర్వేలో పాల్గొనాలని కోరింది.

telephonic survey for feedback
కరోనా వైరస్‌పై ప్రభుత్వం ఫోన్‌ సర్వే

By

Published : Apr 22, 2020, 5:40 AM IST

కరోనా వైరస్‌ గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫోన్‌ కాల్స్ ద్వారా ఈ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ప్రజలకు 1921 అనే నంబర్‌ నుంచి ఫోన్‌ వస్తుందని, ప్రతి ఒక్కరు ఈ సర్వేలో పాల్గొనాలని కోరింది. జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుందని ట్వీట్​ చేసింది.

"ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న నిష్పాక్షిక సర్వే. ప్రజలంతా ఇందులో పాల్గొని, కరోనా వైరస్‌, దాని వ్యాప్తి గురించి తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. కరోనా పేరుతో వచ్చే నకిలీ ఫోన్‌ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి."

- సమాచార శాఖ

మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 18,985కి చేరుకుంది. వీరిలో 15,122 మంది చిక్సిత పొందుతుండగా, 3,260 మంది కోలుకున్నారు. మరో 603 మంది మరణించారు. కరోనా నియంత్రణకు కేంద్రం తొలి దశలో ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ విధించింది. కరోనా కేసుల ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుండం వల్ల లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: కరోనాపై పోరులో సామాన్యులే సైంటిస్టులు

ABOUT THE AUTHOR

...view details