తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​పాల్​గా జస్టిస్​ చంద్రఘోష్​ - అన్నా హజారే

భారత్​కు మొదటి లోక్​పాల్​గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్​ పేరు పరిశీలనలో ఉన్నట్లు అధికారిక వర్గాలు  ప్రకటించాయి. ఆయనతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

జస్టిస్​ చంద్ర ఘోష్

By

Published : Mar 17, 2019, 6:46 PM IST

దేశంలో మొదటి లోక్​పాల్​గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్​ నియమితులయ్యే అవకాశం ఉంది. ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చంద్రఘోష్​తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వెల్లడించాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్​ ఘోష్​ 2017 మేలో పదవీ విరమణ పొందారు. జాతీయ మానవ హక్కుల కమిషన్​(ఎన్​హెచ్​ఆర్​సీ) సభ్యుడిగా ప్రస్తుతం ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన లోక్​పాల్​ ఎంపిక కమిటీ సమావేశంలో ఘోష్​ పేరు ప్రతిపాదనకు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. శుక్రవారం జరిగిన ప్యానెల్​ సమావేశాన్ని లోక్​ పాల్​ ఎంపిక​ కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్​ నేత మల్లికార్జున ఖర్గే బహిష్కరించారు. ఘోష్​ నియామకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే ఈ అంశం వివాదంగా మారే అవకాశాలు లేకపోలేదు.

స్వాగతించిన అన్నా హజారే

పినాకి చంద్ర ఘోష్​ను మొదటి లోక్​పాల్​గా నియమించనున్నారన్న వార్తలను సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్వాగతించారు.

అన్నా హజారే

"దేశానికి మొదటి లోక్​పాల్​ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. 48 ఏళ్లుగా దీనిపై ప్రజా ఉద్యమం జరుగుతోంది. చివరికి ఇప్పుడు విజయం సాధించాం"-అన్నా హజారే.

లోక్ పాల్​ను నియమించాలని అన్నాహజారే చాలా సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో కూడా ఆయన స్వస్థలం ఆహ్మద్​నగర్​లో నిరాహార దీక్ష చేశారు.

ABOUT THE AUTHOR

...view details