16వ లోక్సభ రద్దయి రెండు నెలలైనా రెండువందల మందికి పైగా మాజీ ఎంపీలు దిల్లీలో వారికి కేటాయించిన భవనాలను విడిచిపెట్టి వెళ్లటం లేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మాజీ ఎంపీలు ఒక నెలలోగా భవనాలను విడిచి వెళ్లాలి. కానీ గడువు తీరినా ప్రభుత్వ ఇళ్లను విడిచి వెళ్లని కారణంగా... 17వ లోక్సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ భవనాలను వీడని మాజీ ఎంపీలు - building
పదవి కాలం ముగిసి రెండు నెలలైనా రెండు వందలకు పైగా మాజీ ఎంపీలు వారికి కేటాయించిన భవనాలను ఖాళీ చేయటంలేదని సమాచారం. నిబంధనల ప్రకారం నెల రోజులలోగా ఖాళీ చేయాల్సి ఉండగా గడువుకు మించి ప్రభుత్వ ఆస్తుల్లో మాజీ ఎంపీలు మకాం వేశారని తెలుస్తోంది.
మాజీ ఎంపీలు భవనాలను విడిచి వెళ్లాలి
కొంతమంది ఎంపీలు ఐదునక్షత్రాల హోటళ్లలో ఉండి సభకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, క్రికెటర్ గౌతం గంభీర్ సహా 260 మంది పైగా మెుదటిసారి ఎగువసభకు ఎన్నికయ్యారు. పెద్ద మొత్తంలో నూతన ఎంపీలు ఉండటం, మాజీలు ఖాళీ చేయని కారణంగా భవనాల కేటాయింపు ప్రక్రియ ఇబ్బందికరంగా మారింది.
ఇదీ చూడండి:బావిలో పడిన మొసలి.. రక్షించిన అటవీశాఖ
Last Updated : Sep 27, 2019, 11:40 AM IST