దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, దిల్లీలో జనజీవనం స్తంభించింది. ప్రజారవాణాపై తీవ్ర ప్రభావం పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఒడిశాలో..
భారీ వర్షాలతో ఒడిశాలోని పలు జిల్లాలు నీటమునిగాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. మల్కన్‌గిరి, దెన్కనాల్ జిల్లాల్లో నదులు ఉప్పొంగి పలు గ్రామాలు నీటమునిగాయి. వరదల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు హిమాచల్ ప్రదేశ్‌లో..
హిమాచల్ ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. సిమ్లా-మాతూర్ జాతీయ రహదారిపై కంగ్రా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది.
మధ్యప్రదేశ్‌లో..
భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జబల్పుర్ ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జబల్పుర్లో ప్రధానకూడలిలో చెరువును తలపిస్తున్న దృశ్యం
ఇంటిలోకి వచ్చిన నీటిని తోడుతూ...
మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
కర్ణాటకలో..
కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. బెళగావి ప్రాంతంలో కురుస్తోన్న వర్షాలకు పంటపొలాలు పూర్తిగా నీటమునిగి.. తీవ్ర నష్టం వాటిల్లింది.
కర్ణాటక బెళగావిలో నీటమునిగిన పంటపొలాలు
దిల్లీలో..
దిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. హైకోర్టు, మూల్‌చంద్ రైసినా రోడ్డు, లోధి రోడ్డు ప్రాంతాల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
దిల్లీ మూల్‌చంద్ ప్రాంతంలో ట్రాఫిక్
ఇదీ చూడండి: వరుణుడి ఉగ్రరూపం- సర్వం జలమయం