కరోనాతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందేభారత్ మిషన్ పేరుతో ప్రభుత్వం అతిపెద్ద ప్రాజెక్టు చేపట్టింది. నేటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా అబుదాబి నుంచి బయలుదేరిన తొలి విమానం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో అబుదాబి నుంచి మొత్తం 177 మంది ప్రయాణికులు సహా ఐదుగురు చిన్నారులను స్వదేశానికి తీసుకొచ్చారు అధికారులు.