సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు.. దిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ తలపెట్టిన రైతులు.. మరో ర్యాలీకి సిద్ధమయ్యారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు వరకు పాద యాత్ర చేస్తామని తెలిపారు.
"దేశం నలుమూలల నుంచి దిల్లీలోని టాక్టర్ల ర్యాలీ వచ్చిన వారు తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. మాతో కలిసి ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. అందుకే బడ్జెట్ సెషన్ సందర్భంగా ఫిబ్రవరి 1న పార్లమెంటు వరకు పాద యాత్ర చేయాలని నిర్ణయించాం. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను కొనసాగిస్తాం."