తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గవర్నర్​ వద్దకు వేర్వేరుగా భాజపా, శివసేన నేతలు- ఎందుకు?

మహారాష్ట్ర గవర్నర్​ వద్దకు విడివిడిగా వెళ్లారు భాజపా, శివసేన నేతలు. సీఎం దేవేంద్ర ఫడణవీస్​, శివసేన నేత దివాకర్ రావోటే రాజ్​భవన్​కు చేరుకున్నారు. అయితే... ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యం లేదని, గవర్నర్​కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకేనని రాజ్​భవన్​ వర్గాలు స్పష్టంచేశాయి.

MH-GUV-BJP-SENA

By

Published : Oct 28, 2019, 11:26 AM IST

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా, శివసేన మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో గవర్నర్​ వద్దకు విడివిడిగా వెళ్లారు ఆ పార్టీల నేతలు. భాజపా నుంచి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్,​ శివసేన సేన దివాకర్ రావోటే రాజ్​భవన్​కు చేరుకున్నారు.

గవర్నర్​కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే కలవనున్నట్లు తెలిపారు ఇద్దరు నేతలు. ఇందులో ప్రభుత్వ ఏర్పాటు, రాజకీయాలపై చర్చలేమీ ఉండవని స్పష్టం చేశారు.

తాజా ఎన్నికల్లో భాజపాకు మెజారిటీ తగ్గిన కారణంగా ఇద్దరు సీఎంల ప్రతిపాదన తీసుకొచ్చింది శివసేన. దీనిపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో 105 మందితో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గతం కన్నా 17 సీట్లు తక్కువ సాధించింది.

ABOUT THE AUTHOR

...view details